తెలంగాణ టెన్త్ పరీక్షలపై హైకోర్టు సంచలన నిర్ణయం... వారికిప్పుడు పరీక్షల్లేవ్..

పంజాబ్‌ తరహాలో పరీక్షలు లేకుండానే విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని పిటిషనర్ వాదించారు.

news18-telugu
Updated: June 6, 2020, 7:29 PM IST
తెలంగాణ టెన్త్ పరీక్షలపై హైకోర్టు సంచలన నిర్ణయం... వారికిప్పుడు పరీక్షల్లేవ్..
వారిని కూడా పరీక్షలు లేకుండా పాస్‌చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
  • Share this:
తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మినహా మిగిలిన చోట్ల పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఈరోజు రెండుసార్లు విచారణ జరిగింది. ఉదయం జరిగిన వాదన సందర్భంగా ... ఇప్పుడు నిర్వహించాలనుకుంటున్న పదో తరగతి పరీక్షలకు హాజరుకాలేకపోయిన వారికి అడ్వాన్స్ సప్లిమెంటరీలో అవకాశం కల్పిస్తామని, అయితే, వారిని కూడా రెగ్యులర్ కిందే పరిగణిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టుకు నివేదించారు.

తెలంగాణ ప్రభుత్వం పరీక్షల మీద దృష్టి పెడుతోందని, అయితే, రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని పిటిషనర్ వాదించారు. పంజాబ్‌ తరహాలో పరీక్షలు లేకుండానే విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని పిటిషనర్ వాదించారు. పరీక్షలు లేకుండా గ్రేడింగ్ ఇస్తే ఇబ్బందేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అలాగే, ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ మినహా మిగతా జిల్లాల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు సూచించింది. దీనిపై ఏజీ అభ్యంతరం తెలిపారు. రాష్ట్రంలో వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం కష్టమని పేర్కొన్నారు. ప్రశ్నపత్రం మళ్లీ మళ్లీ తయారుచేయడం ఇబ్బంది అవుతుందన్నారు. అయితే, విద్యార్థుల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని కోర్టు ప్రశ్నించింది. అనంతరం జీహెచ్ఎంసీ జిల్లా మినహా మిగిలిన చోట్ల పరీక్షల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాంతాల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించినప్పుడు విద్యార్థులకు అవకాశం కల్పించాలని ఆదేశించింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 6, 2020, 5:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading