TELANGANA HIGH COURT ONCE AGAIN EXTENDS APPLICATION LAST DATE TILL 2020 JUNE 15 FOR 87 CIVIL JUDGE POSTS SS
Telangana Jobs: తెలంగాణ హైకోర్టులో జాబ్స్... మరోసారి దరఖాస్తు గడువు పెంపు
Telangana Jobs: తెలంగాణ హైకోర్టులో జాబ్స్... మరోసారి దరఖాస్తు గడువు పెంపు
(ప్రతీకాత్మక చిత్రం)
Telangana High Court Recruitment 2020 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ హైకోర్టు ఖాళీల భర్తీకి దరఖాస్తు గడువు మరోసారి పొడిగించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునేవారికి శుభవార్త. మరోసారి దరఖాస్తు గడువు పొడిగించింది హైకోర్టు. వాస్తవానికి ఈ ఉద్యోగాలకు 2020 ఏప్రిల్ 13న దరఖాస్తు గడువు ముగిసింది. కానీ కరోనావైరస్ సంక్షోభం కారణంగా దరఖాస్తు గడువును 2020 మే 15 వరకు పొడిగించింది కోర్టు. కానీ లాక్‌డౌన్ ఇంకా కొనసాగుతుండటంతో ఆన్‌లైన్ దరఖాస్తుల సబ్మిషన్ మరోసారి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటీసు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. అభ్యర్థులు అప్లై చేయడానికి 2020 జూన్ 15 వరకు అవకాశం ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 87 సివిల్ జడ్జి పోస్టుల్ని భర్తీ చేస్తోంది తెలంగాణ హైకోర్టు. ఆసక్తిగల అభ్యర్థులు http://tshc.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఇక ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులు మాక్ టెస్ట్‌కు హాజరుకావొచ్చు. http://tshc.gov.in/ వెబ్‌సైట్‌లోనే మాక్ టెస్ట్ లింక్ యాక్టివేట్ అయింది.
Telangana High Court Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...
సివిల్ జడ్జి పోస్టులు- 87
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులు- 70
ట్రాన్స్‌ఫర్ భర్తీ చేసే పోస్టులు- 17
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 13
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 15
విద్యార్హత- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ. ఏదైనా కోర్టులో 3 ఏళ్లకు పైగా అడ్వకేట్‌గా పనిచేసిన అనుభవం.
వయస్సు- 25 నుంచి 35 ఏళ్లు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1,000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500.
పరీక్షా కేంద్రాలు- హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు గడువు పొడిగిస్తూ జారీ చేసిన నోటీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మాక్ టెస్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.