Home /News /jobs /

TELANGANA HIGH COURT HAS RELEASED A NOTIFICATION FOR THE RECRUITMENT OF JOBS ELIGIBLE AND INTERESTED CANDIDATES CAN APPLY BEFORE AUGUST 25 VB

Typist-Copyist Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో హైకోర్ట్‌ లో టైపిస్ట్, Copyist పోస్టులకు నోటిఫికేషన్..

Typist-Copyist Jobs: నిరుద్యోగుకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో హైకోర్ట్‌ లో టైపిస్ట్, Copyist పోస్టులకు నోటిఫికేషన్..

Typist-Copyist Jobs: నిరుద్యోగుకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో హైకోర్ట్‌ లో టైపిస్ట్, Copyist పోస్టులకు నోటిఫికేషన్..

Typist-Copyist Jobs: తెలంగాణ హైకోర్ట్‌ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 25లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ హైకోర్ట్‌ లో(Telangana High Court) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల అయింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 25 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా టైపిస్ట్, కాపీయిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 85 ఖాళీలను నియమించనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే..  కామర్స్ లేదా సైన్స్ లేదా ఆర్ట్స్(Arts) లేదా లా(Law)లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా తత్సమాన కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. ఈ డగ్రీతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. దీనిలో భాగంగా టైపిస్ట్ ( English Higher Grade) ఉత్తీర్ణులై ఉండాలి. దీనికి ప్రభుత్వ టెక్నికల్ డిపార్ట్ మెంట్ నుంచి సర్టిఫికేట్ పొంది ఉండాలి.

Indian Navy Recruitment: అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. మహిళలకు కూడా అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు..


జూలై 1, 2022 నాటికి అభ్యర్థులు తప్పనిసరిగా 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. 34 సంవత్సరాల వయస్సు పూర్తి కాకూడదు. ఏజెన్సీ ప్రాంతాల్లోని SCలు మరియు STలు లేదా ఆదివాసీ తెగలు, BCలు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS) గరిష్ట వయోపరిమితిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఐదు సంవత్సరాలు ఇచ్చారు. వికలాంగ అభ్యర్ధులకు 10 యేళ్ల సడలింపు వర్తిస్తుంది.మాజీ సైనికులకు సంబంధించి గరిష్ట వయోపరిమితిలో సడలింపు తెలంగాణ రాష్ట్ర మరియు సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఉంటుంది.



OC మరియు BC వర్గాలకు చెందిన అభ్యర్థులు పరీక్ష ఫీజు కింద రూ.800, ఎస్సీ, ఎస్టీలు మరియు EWS కేటగిరీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి. స్పోర్ట్స్ కోటా మరియు ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే వారు అభ్యర్థులకు వారికి ఏమైనా వేకెన్సీ ఉంటే.. సంబంధిత తరగతి మరియు కేటగిరీ ప్రకారం నిర్దేశించిన విధంగా పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

Government Job Vacancies: UPSC నుంచి రైల్వే జాబ్స్ వరకు.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా..?


దరఖాస్తు విధానం ఇలా..

- మొదట https://tshc.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాలి.

-దీనిలో కాస్త కిందకు వస్తే.. recruitment అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై టాప్ చేయాలి.

-దాని నుంచి నోటిఫికేషన్ పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకొని.. అర్హత వివరాలను పూర్తిగా తెలుసుకొని దరఖాస్తులను సమర్పించాలి.

-దీనిలో దరఖాస్తు చేయాలంటే రెండు పార్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి పార్ట్ ఏ.. దీనిలో వివరాలను నమోదు చేసిన తర్వాత ఒక యూజర్ ఐడీ వస్తుంది.

-పార్ట్ ఏలో వచ్చిన యూజర్ ఐడీ ఆధారం చేసుకొని పార్ట్ బీలో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

-పార్ట్ బీలో పూర్తి సమాచారాన్ని ఇచ్చి.. అప్లికేషన్ పీడీఎఫ్ ను ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోవాలి.

ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం ఆగస్టు 10 నుంచి ఉంటుంది. ఆ రోజు నుంచి లింక్ యాక్టివేట్ కానుంది. రాత పరీక్ష ఆధారంగా ఈ ఎంపికలు ఉంటాయి. రాత పరీక్ష 40 మార్కులు , ఇంగ్లీష్ టైప్ రైటింగ్ టెస్టుకు 40 మార్కులు. ఈ రెండింటిలో అర్హత సాధించిన వారిని 1: 3 రేషియోలో ఇంటర్వ్యూ లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలుస్తారు. దీనికి 20 మార్కులు కేటాయించారు. మొత్తం 100  మార్కుల్లో మెరిట్ సాధించిన వారికి ఈ పోస్టులను కేటాయిస్తారు.

ఇక తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్ అనేది ఉమ్మడి మూడు జిల్లాలో నిర్వహించనున్నారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. హాల్ టికెట్స్ సెప్టెంబర్ 5న డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 25న రాత పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://tshc.gov.in/ ను సందర్శించాలి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Published by:Veera Babu
First published:

Tags: Highcourt, JOBS, Telangana jobs, Typist

తదుపరి వార్తలు