news18-telugu
Updated: May 19, 2020, 1:15 PM IST
(ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 8 నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశించింది. టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరిన సంగతి తెలిసిందే. పదవ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో ఈ అఫిడవిట్‌పై హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. పరీక్ష కేంద్రాల దగ్గర అన్ని చర్యలు తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. దీంతో జూన్ 8 నుంచి హైకోర్టు పరీక్షల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. అయితే జూన్ 3న కరోనా వైరస్ పరిస్థితులను సమీక్షించాలని, జూన్ 4న కోవిడ్ 19 పరిస్థితులపై నివేదిక సమర్పించాలని హైకోర్టు అదేశించింది. కేసులో తీవ్రతను బట్టి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు వెల్లడించింది.
హైకోర్టు ఆదేశాలతో తెలంగాణలో జూన్ 8 నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండాలని హైకోర్టు సూచించింది. పరీక్షా కేంద్రాలను రెట్టింపు చేయడంతో పాటు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని సూచించింది. టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కరోనా వైరస్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం వివరించింది.
Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
Railway Jobs: ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 663 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే
Andhra Pradesh Jobs: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
TCS Internship: ఇంట్లో కూర్చొనే ఇంటర్న్‌షిప్... విద్యార్థులకు అద్భుత అవకాశం
Published by:
Santhosh Kumar S
First published:
May 19, 2020, 1:15 PM IST