హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Govt Jobs: త్వరలో ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దసరా కానుకగా మరో వేయి మంది విధుల్లోకి.. మంత్రి హరీశ్ కీలక ప్రకటన

Telangana Govt Jobs: త్వరలో ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దసరా కానుకగా మరో వేయి మంది విధుల్లోకి.. మంత్రి హరీశ్ కీలక ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) శుభవార్త చెప్పారు. పలు ఉద్యోగాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఉన్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Vijayawada

  త్వరలో స్టాఫ్ నర్సు ఏఎన్ఏం ఉద్యోగాలకు నోటిఫికేషన్ (Telangana Government Jobs) విడుదల చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) ప్రకటించారు. అసెంబ్లీలో వైద్య సిబ్బంది పదవీ విరమణ వయసు పెంపు సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి ఈ ప్రకటన చేశారు. ఇంకా మంత్రి మాట్లాడుతూ.. దసరా కానుకగా వేయి మంది డాక్టర్ల నియామకం (Doctors Recruitment) చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో వెయ్యి మంది డాక్టర్ల నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకున్నదన్నారు. దసరా పండుగా నాటికి వారికి ఉత్తర్వులు అందజేస్తామన్నారు. స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎం, ఇతర సిబ్బంది నియామకానికి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో 800 మంది సీనియర్‌ రెసిడెంట్లను ఇటీవలే పూర్తిగా జిల్లాల్లోనే నియమించినట్లు వివరించారు.

  దుబ్బాకలో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు తుదిదశలో ఉన్నదని, 15 రోజుల్లో ప్రారంభమవుతుందని చెప్పారు. తెలంగాణ ఆవిర్భవానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో 3 డయాలసిస్‌ సెంటర్లు ఉంటే, ఇప్పుడు 103కు చేరాయన్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ ఇంజనీర్, మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది.

  New Recruitment Board In Telangana: 15 వర్సిటీల సిబ్బంది నియామకాలకు కొత్త బోర్డు.. ఆ 3,500 పోస్టులు కూడా ఈ బోర్డు ద్వారానే..

  మొత్తం 833 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు 2022 సెప్టెంబర్ 28న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2022 అక్టోబర్ 21 చివరి తేదీ. డీటెయిల్డ్ నోటిఫికేషన్2022 సెప్టెంబర్ 23న విడుదల కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాలను టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in లో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్ లో ఈ కింది వివరాలు ఉన్నాయి.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Harish Rao, Job notification, JOBS, State Government Jobs, Telangana government jobs

  ఉత్తమ కథలు