ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. థర్డ్ వేవ్ ఇప్పట్లో వచ్చే పరిస్థితి కూడా లేనందును వైద్య, ఆర్యోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నిరభ్యంతరంగా పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోవచ్చని విద్యాశాఖకు సూచించింది. ప్రభుత్వం సూచింన కరోనా నిబంధనలను పాటిస్తూ విద్యా సంస్థలు తెరవాలని సూచించింది. సినిమా హాళ్లకు, పబ్ లకు అనుమతి ఇచ్చినప్పుడు విద్యా సంస్థలను తెరిస్తే తప్పేముందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రాజకీయ నాయకుల యాత్రలు, సభలు కొనసాగుతున్నాయి.. వాటికి లేని నిబంధనలు విద్యా శాఖకు కూడా అవసరం లేదని వైద్య, ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది. విద్యార్థులు తీవ్ర మానసిక సమస్యలతో ఇబ్బందులకు గురవుతన్నాని.. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నట్లు కూడా తెలిపారు. ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ప్రమోషన్ విధానం నష్టం చేకూర్చుతుంది. ఇది విద్యార్థి భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని స్కూళ్లు, కాలేజీలు తెరవాలని సూచించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.
ఆరోగ్య శాఖ స్పష్టత ఇచ్చినా విద్యా సంస్థలు తెరవడంపై విద్యాశాఖ వర్గాలు తర్జన భర్జనలు పడుతున్నాయి. ఆగస్టు 15 నుంచి కొన్ని రాష్ట్రాలు ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని నిర్ణయించాయి. తల్లిదండ్రులు కూడా కొన్ని నిబంధనలను పాటిస్తూ పాఠశాలలు తెరవాలని కోరుతున్నారు. తొమ్మిది, పది విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు పెట్టి.. మిగతా వారికి ఆన్ లైన్ క్లాసులు కొనసాగించలానే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. డిజిటల్ క్లాసుల ద్వారా విద్యార్థులకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే విద్యాశాఖకు వైద్య ఆరోగ్య శాఖ కొన్ని నిబంధనలతో పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోవచ్చు అని స్పష్టం చేసింది. తరగతి గదిలో ప్రతీ వస్తువును శానిటైజ్ చేయాలని సూచించింది.
Read Also: రసవత్తరంగా హుజురాబాద్ రాజకీయం.. ఈటెలకు చెక్ పెట్టేందుకు నాడు తండ్రి ప్రయత్నిస్తే.. నేడు తనయుడు..
మరుగుదొడ్లను ప్రతీ రోజు శుభ్రం చేయాలి. విద్యార్థులకు కరోనా నెగెటివ్ రిపోర్టు తీసుకురావాలన్న నిబంధన విధించాలి. జ్వరం, దగ్గు ఉంటే వారిని అనుమతించకూడదు. భౌతిక దూరం పాటించేలా గదిలో ఏర్పాటు చేయాలి. మాస్క్ లు, శానిటైజర్ బాటిళ్లు అందుబాటులో ఉంచాలి. హాస్టళ్లను ప్రత్యేక జాగ్రత్తల నడుమ తెరవాలి. విద్యార్థుల రూముల్లోకే భోజనం పంపించేలా ఏర్పాట్లు చేయాలన సూచించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Health department, Telangana schools