తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. వరుసగా ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వస్తున్నాయి. అదే విధంగా టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి కూడా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా మరో నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ నుంచి విడుదల అయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. గత వారం రోజుల నుంచి 3 నోటిఫికేషన్లను(Notifications) విడుదల చేశారు. తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో 833 ఇంజినీరింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.
అంతే కాకుండా.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి పోస్టులను కూడా టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. తాజాగా అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇలా వివిధ విభాగాల్లో 833 ఇంజినీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ 21 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చని సూచించింది.
మొత్తం పోస్టుల సంఖ్య.. 833
వివిధ విభాగాల వారీగా ఖాళీలు ఇలా..
1. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (పంచాయత్రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మిషన్)పోస్టులు.. 62
2.అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (పంచాయత్రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మిషన్)పోస్టులు.. 41
3. అసిస్టెంట్ ఇంజనీర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పబ్లిక్ హెల్త్)పోస్టులు.. 13
4. మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పబ్లిక్ హెల్త్)పోస్టులు.. 29
5. టెక్నికల్ ఆఫీసర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పబ్లిక్ హెల్త్)పోస్టులు.. 09
6. అసిస్టెంట్ ఇంజనీర్ (ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్)పోస్టులు.. 03
7. అసిస్టెంట్ ఇంజనీర్ (ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్)పోస్టులు.. 227
8. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (గ్రౌండ్ వాటర్)పోస్టులు.. 12
9. అసిస్టెంట్ ఇంజనీర్ (ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్)పోస్టులు.. 38
10. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (పంచాయత్రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్)పోస్టులు.. 27
11. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (పంచాయత్రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్)పోస్టులు.. 68
12. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పబ్లిక్ హెల్త్)పోస్టులు.. 32
13.జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్)పోస్టులు.. 212
14. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్)పోస్టులు.. 60
అర్హతలు ఇలా..
పోస్టు పేరు | అర్హతలు |
అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (పంచాయత్రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మిషన్) | డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ |
అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (పంచాయత్రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మిషన్) | డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ |
అసిస్టెంట్ ఇంజనీర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పబ్లిక్ హెల్త్) | డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ |
మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పబ్లిక్ హెల్త్) | డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ |
టెక్నికల్ ఆఫీసర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పబ్లిక్ హెల్త్ | డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ |
అసిస్టెంట్ ఇంజనీర్ (ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్) | డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ లేదా బీటెక్ లో 4 ఏళ్ల సివిల్ ఇంజనీరింగ్ |
అసిస్టెంట్ ఇంజనీర్ (ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ | డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా మెకానికిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ |
అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (గ్రౌండ్ వాటర్) | డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ లేదా తత్సమానం |
అసిస్టెంట్ ఇంజనీర్ (ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్) | డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ |
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (పంచాయత్రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్) | డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ లేదా బీటెక్ లో సివిల్ ఇంజనీరింగ్ |
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (పంచాయత్రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్) | డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ |
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పబ్లిక్ హెల్త్) | డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ |
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్) | డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమాలో మెకానికిల్ ఇంజనీరింగ్ లేదా తత్సమానం |
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్) | డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ |
దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో మాత్రమే పంపించాలి.
అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయో పరిమితి ఉంటుంది. దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
జీతం..అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు నెలకు రూ. 45,960 నుంచి రూ. 1,24,150 వరకు చెల్లిస్తారు. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు నెలకు రూ. 32,810 నుంచి రూ.96,890 మధ్య చెల్లిస్తారు.
పూర్తి నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, TSPSC