Home /News /jobs /

TELANGANA GROUPS AND POLICE JOBS HERE IS THE IMPORTANT PREPARATION TIPS FOR POLITY NS KNR

Telangana Jobs Polity Preparation Tips: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే, పాలిటీపై పట్టు పెంచుకోండిలా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియన్ పాలిటీ నుండి గ్రూప్స్ లో 50 మార్కులు ఉంటాయి..మరి ఎక్కువ స్క్రోరు సాధిస్తేనే ఉద్యోగ సాధన సులువు అవుతుంది . ఈ నేపథ్యంలో సీనియర్ ఫ్యాకల్టీ , ఏపీజే అబ్దుల్ కలమ్ చారిటబుల్ ట్రస్ట్ సీనియర్ ఫ్యాకల్టీ పన్నీరు రవిచంద్ర సూచనలు చేశారు . ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    -శ్రీనివాస్. పి, న్యూస్18తెలుగు కరీంనగర్ ప్రతినిధి.
    తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల  (Telangana Government Jobs) భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notification)  విడుదలవుతున్న విషయం తెలిసిందే . దీంతో లక్షలాది మంది అభ్యర్థులు తమ కలల కొలువు సాధించాలన్న లక్ష్యంతో ప్రిపేర్ అవుతున్నారు . ఏ ఉద్యోగ నియామక పరీక్ష అయినా ..ఇండియన్ పాలిటీ పై గ్రూప్స్ లో 50  మార్కులు ఉంటాయి. ఇందులో ఎక్కువ స్కోర్ సాధిస్తేనే ఉద్యోగ సాధన సులువు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ ఫ్యాకల్టీ పన్నీరు రవిచంద్ర అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా అవేంటో ఒకసారి చూద్దాం.. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవారు రాజ్యాంగ సవరణలు, చట్టాలు, కేసులు ఆర్టికల్ పై ఎక్కువగా పోకస్ చేయాలన్నారు. ఎస్ఐ జాబ్స్ అభ్యర్థులు కేంద్ర, రాష్ట్ర, లోకల్, గవర్ననేన్సీ విషయాలను బాగా చదువుకోవాలన్నారు . ఈ టాపిక్స్ ను కవర్ చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు సంబంధించి 70 శాతం సిలబస్ ను కవర్ చేసినట్లేనన్నారు. మిగతా 30 శాతం సిలబస్ ను 2016, గ్రూప్ సంబంధించిన మాదిరి ప్రశ్న పత్రలను ఒకటికి రెండు సార్లు చూసుకుంటే సరిపోతుందన్నారు.

    గతంలో గ్రూప్స్ సంబంధించిన పేపర్స్ లోతుగా ఇవ్వడంతో కనీసం పాలిటీలో 20 మార్కులను అభ్యర్థులు సాధించలేదు.అంటే పేపర్ ఎంత హార్డ్ గా ఉందొ అర్థం చేసుకోవచ్చు.. కాబట్టి మొదట ప్రశ్నలను అర్థం చేసుకోవడం అలవర్చుకోవాలని అభ్యర్థులకు సూచించారు . ప్రతీ ప్రశ్నకు యావరేజ్ గా 40 సెకండ్ల సమయం ఉంటుందన్నారు . ఈ సమయంలోనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుని ఆన్సర్ కనుగొనడంతో పాటు క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు . పాలిటీ సబ్జెక్టులో ఎక్కువగా జతపరిచే విధానం  ఇచ్చి కన్ఫ్యూషన్ చేస్తారు. కాబట్టి తక్కువ సమయంలో ఆన్సర్ చేయాలంటే సాధన ఎక్కువ చేయాలన్నారు. నియామక పరీక్షలకు సమయం తక్కువగా ఉన్నందున అభ్యర్థులు తెలుగు పాఠ్య పుస్తకాలతో పాటు.. తెలంగాణ ప్రవేశపెట్టిన పుస్తకాలు చదవాలన్నారు.
    Telangana Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు మరో శుభవార్త.. మరో 2,774 ఖాళీల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్.. వివరాలివే

    ఎక్కువ పుస్తకాలు చదవడం కన్నా .. ఎంపిక చేసిన పుస్తకాలనే చదువుకోవాలని అభ్యర్థులకు సూచించారు . క్లాస్ రూమ్స్ లో చెప్పిన ప్రతీ అంశాన్ని నోట్స్ ప్రిపేర్ చేసేకుని వాటిని ఫాలో అయితే తప్పకుండా ఎస్ఐ, గ్రూప్స్ జాబ్స్ మనవే అంటున్నారు.. రవిచంద్ర సార్. అభ్యర్థులు ముందుగా సిలబస్ ఏంటనే అంశాన్ని ఫోకస్ చేయాలని సూచించారు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ను సేకరించి వాటిలోని ప్రశ్నలను సాధన చేయాలన్నారు. ఆ పేపర్లలో ప్రశ్నలు ఎలా అడుగుతున్నారనే అంశంపై పట్టు సాధించాలన్నారు. ప్రిపరేషన్ ప్రారంభించిన నాటి నుంచి ఎగ్జామ్ ముందు రోజు వరకూ ప్రిపరేషన్లో ఆసక్తి తగ్గకుండా ఉండేలా జాగ్రత్తలు పాటించాలన్నారు .
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job notification, JOBS, Telangana government jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు