తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు (Telangana Government Jobs) సంబంధించిన నోటిఫికేషన్ల జాతర కొనసాగుతోన్న విషయం తెలిసిందే. మొత్తం 80 వేలకు పైగా ఖాళీల భర్తీకి అధికారులు వసరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే 503 ఖాళీలతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) విడుదల చేసింది. 17 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంకా త్వరలోనే 9 వేలకు పైగా ఖాళీలతో గ్రూప్ 4 నోటిఫికేషన్ ను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకే సారి ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అవుతున్న ఈ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా లక్షలాది మంది అభ్యర్థులు ప్రిపరేషన్ ను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే ఉద్యోగం ఏదైనా అభ్యర్థులు జనలర్ స్టడీస్ మాత్రం దాదాపు కామన్ గా ఉంటుంది.
జనరల్ స్టడీస్ లో పట్టు సాధించిన అభ్యర్థులు ఏ ఉద్యోగ నియామక పరీక్షలో అయినా.. సత్తా చాటొచ్చని నిపుణులు చెబుతున్నారు. గ్రూప్ 1 లో జనరల్ స్టడీస్ కు సంబంధించి 150 ప్రశ్నలు ఉంటాయి. సబ్ ఇన్ స్పెక్టర్ లో 200 ప్రశ్నలు ఉంటాయి. అయితే ఇందులో కొన్ని టాపిక్స్ ప్రతీ సారి రిపీట్ అవుతూ ఉంటాయని జనరల్ స్టడీస్ నిపుణులు రవి రెడ్డి తెలిపారు. ఆ టాపిక్స్ పై మంచి అవగాహన పెంచుకుంటే మంచి స్కోర్ సాధించవచ్చని సూచించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. TSPSC Group-4 Notification: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. అతి త్వరలోనే 9,168 పోస్టులతో గ్రూప్-4 నోటిఫికేషన్.. ఎప్పుడంటే?
-ఒక మార్కు విటమిన్స్ అండ్ మినరల్స్ నుంచి దాదాపు అన్ని పోటీ పరీక్షల్లో ఒక మార్కుకు ప్రశ్న ఉంటుంది. దీంతో అభ్యర్థులు వీటి గురించి బాగా చదువుకోవాలి.
-విటమిన్స్ రెండు రకాలుగా ఉంటాయి. అవి నీటిలో కరిగేవి. రెండవది కొవ్వులో కరిగేవి. ఇంకా విటమిన్స్ పేరు, రసాయన నామం, ఏ ఆహారంతో అవి శరీరానికి అందుతాయి? వాటి లోపాల కారణంగా వచ్చే వ్యాధులు ఏంటి? తదితర విషయాలపై నోట్స్ రాసుకుని ప్రిపేర్ అవ్వడం బెటర్.
-మినరల్స్ పేర్లు, వాటి లోపాల వల్ల వచ్చే వ్యాధులు, అవి వేటి వల్ల లభిస్తాయి? తదితర విషయాలను సైతం తెలుసుకోవాలి. Govt Jobs Preparation App: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారి అలర్ట్.. ప్రత్యేక యాప్ ఆవిష్కరణ.. డౌన్లోడ్ చేసుకోండిలా..
-గతంలో వ్యాధుల నుంచి 1 ప్రశ్న వచ్చేది.
-బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ప్రొటోజోవా కారణంగా వ్యాధులు మనకు వస్తాయి. వాటి గురించి తెలుసుకోవాలి.
-ప్రపంచాన్ని గడగడాలించిన కోవిడ్ పై ఈ సారి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. కరోనా పుట్టుక, కరోనా రాని దేశాలు, తొలి కరోనా కేసు, తొలి వ్యాక్సిన్, దానికి తయారు చేసిన వ్యక్తి. భారత దేశంలో వ్యాక్సిన్ మొదటి సారి అందించిన వ్యక్తి తదితర అంశాలను తెలుసుకోవాలి.
- ఇంకా గ్రంథాలు, గ్రంథ రచయితలు అంశంపై ప్రతీసారి ప్రశ్నలు వస్తాయి. చరిత్రకు ఆధారమైన గ్రంథాలు, కాంట్రవర్సీకి కారణమైన పుస్తకాలు, సాహిత్యంలో అత్యుత్తమ అవార్డులు, వాటిని పొందిన వ్యక్తులపై ప్రశ్నలు తరచుగా వస్తూ ఉంటాయి. అభ్యర్థులు ఈ అంశాలపై పట్టు పెంచుకోవాలి,
- ప్రతీ కాంపిటేటీవ్ ఎగ్జామ్ లోనూ యుద్ధాలపై రెండు మార్కులకు ప్రశ్నలు వస్తాయి. సింధూ నాగరికత నుంచి ఇటీవల పాకిస్థాన్ తో భారతదేశానికి జరిగిన యుద్ధం వరకు అభ్యర్థులు అన్ని విషయాలు తెలుసుకోవాలి. యుద్ధం జరిగిన సంవత్సరం పేరు, ఎవరెవరికి మధ్య జరిగింది? ఎవరు గెలిచారు? ఆ యుద్ధం ఏ సంధితో ముగిసింది? తదితర అంశాలతో అభ్యర్థులు టేబుల్ తయారు చేసుకుని ప్రిపేర్ అయితే మంచిది.
-మరొక మార్కు వచ్చే అంశాలు శాసనాలు.. అభ్యర్థులు శాసనాల టాపిక్ ను బాగా చదివితే ఒక మార్కుల లభిస్తుందని రవిరెడ్డి వివరించారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.