హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Group 1 Key: తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. కీ విడుదలపై తాజా అప్ డేట్ ఇదే!

TSPSC Group 1 Key: తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. కీ విడుదలపై తాజా అప్ డేట్ ఇదే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ నెల 16న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పరీక్షకు సంబంధించిన కీ, ఫలితాల విడుదల ఎప్పుడనే అంశంపై అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఈ నెల 16న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 (TSPSC Group1) ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పరీక్షకు సంబంధించిన కీ, ఫలితాల విడుదల ఎప్పుడనే అంశంపై అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ వారంలోనే కీని విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ (TSPSC) ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి ముందుగా ప్రైమరీ కీని విడుదల చేయనున్నారు అధికారులు. ఈ నెల 28వ తేదీ వరకు ఓఎంఆర్ షీట్లకు సంబంధించిన స్కానింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ స్కానింగ్ పూర్తయిన తర్వాత వాటిని టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లో (https://www.tspsc.gov.in/)  అందుబాటులో ఉంచనున్నారు. అయితే వాటిని అందరికీ అందుబాటులో ఉంచకుండా.. ఓటీఆర్ లాగిన్ ద్వారా అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు తమ వివరాలతో లాగిన్ అయ్యి ఓఎంఆర్ షీట్లను పరిశీలించుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ కీని ఒకే సారి వెబ్ సైట్లో అందుబాటులో ఉంచాలని తొలుత అధికారులు భావించారు.

అయితే.. అలా కాకుండా అభ్యర్థుల ఓటీఆర్ లాగిన్ లోనే ఆ ఓఎంఆర్ షీట్ ను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఈ నెల 28వ తేదీ వరకు ఓఎంఆర్ స్కానింగ్ ప్రక్రియ పూర్తి అయితే ఆ మరుసటి రోజు వరకే ఓటీఆర్ లాగిన్ లో వాటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ముందు ప్రైమరీ కీని విడుదల చేసి.. వాటిపై అభ్యంతరాలను ఓటీఆర్ ద్వారా స్వీకరించనున్నారు. ఇందుకోసం 5 రోజుల వరకు గడువు ఇచ్చే అవకాశం ఉంది. అనంతరం అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తారు. తర్వాత ఫైనల్ కీని విడుదల చేస్తారు.

Railway Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ఇండియన్ రైల్వేలో ఉద్యోగాలు .. ఇలా దరఖాస్తు చేసుకోండి

ఇదిలా ఉంటే.. ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ వస్తోన్న ఆరోపణలను హైదరాబాద్ కలెక్టర్ అమోయ్ కుమార్ ఖండించారు. ఇటువంటి ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదంటూ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్‌లోని లాలాగూడలోని సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్స్ హైస్కూల్‌లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన 47 మంది అభ్యర్థులకు ఇంగ్లిష్/తెలుగు క్వశ్చన్ పేపర్‌కు బదులుగా ఇంగ్లిష్/హిందీ క్వశ్చన్ పేపర్‌ ఇచ్చారని తెలిపారు.

దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని.. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారికి ఇంగ్లీష్ / తెలుగు ప్రశ్నాపత్రంతో పాటు.. కొత్త ఓఎంఆర్ షీట్లను ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కొత్త ఓఎంఆర్ పత్రాలలో తాము పరీక్ష రాస్తే.. తమ జవాబు పత్రాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూల్యాంకనం చేయదనే అనుమానంతో అభ్యర్థులు నిరసనకు దిగారని, అయితే కలెక్టర్‌తో పాటు కమిషన్ అధికారులు వాళ్లకు సర్ది చెప్పడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు వాళ్లు తిరిగి తమ పరీక్షను కొనసాగించారని తెలిపారు. అయితే ఈ సమయంలో ఏ ఒక్క అభ్యర్థి కూడా బయటకు వెళ్లలేదని.. పరీక్ష పూర్తయిన తర్వాతనే వాళ్లు బయటకు వచ్చినట్లు పేర్కొన్నారు.

First published:

Tags: Job notification, JOBS, Telangana government jobs, TSPSC

ఉత్తమ కథలు