విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..

విద్యార్థులు నష్టపోకుండా విద్యా సంవత్సరంలో గతంలో చూపిన ప్రతిభ ఆధారంగా పదో తరగతి విద్యార్థులను పాస్ చేసిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: July 25, 2020, 7:18 AM IST
విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విద్యా సంవత్సరంపై తీవ్ర ప్రభావం పడింది. కొత్త కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలన్నీ దాదాపు వాయిదా పడ్డాయి. గతేడాదికి సంబంధించిన నిర్వహించాల్సిన వార్షిక పరీక్షలపైనా ప్రభావం పడింది. అందులో భాగంగానే విద్యార్థులు నష్టపోకుండా విద్యా సంవత్సరంలో గతంలో చూపిన ప్రతిభ ఆధారంగా పదో తరగతి విద్యార్థులను పాస్ చేసిన సంగతి తెలిసిందే. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఆటోమెటిక్‌గా ప్రమోట్ చేశారు. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులను పాస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విద్యార్థులందరికీ పరీక్షలు లేకుండానే వారందరికీ ఒక్కో సబ్జెక్టుకు 35 మార్కులు ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల 78వేల మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. రాష్ట్రవ్యాప్తంగా ఓపెన్ స్కూల్‌లో 35 వేల మంది పదో తరగతి, 43వేల మంది ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్నారు.
Published by: Narsimha Badhini
First published: July 25, 2020, 7:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading