Home /News /jobs /

TELANGANA GOVT POSTPONED SSC EXAMS AFTER HIGH COURT ORDERED TO CONDUCT OUTSIDE GHMC LIMITS BA

TS SSC Exams 2020 | తెలంగాణ పదో తరగతి పరీక్షలు వాయిదా...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న జీహెచ్ఎంసీ పరిధి మినహా రాష్ట్రంలోని మిగిలిన చోట్ల పరీక్షలు నిర్వహించవచ్చంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికే వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో ఒకసారి, జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి పరీక్షలు నిర్వహించడం కంటే ప్రస్తుతానికి వాయిదా వేసి, రాష్ట్రం మొత్తం ఒకేసారి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అందుకే మొత్తానికే వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కరోనా వైరస్ ఉధృతంగా ఉంది. కొంచెం తగ్గుముఖం పట్టిన పరీక్షలు ఎప్పుడు నిర్వహించే అంశంపై మరోసారి ప్రభుత్వం కొత్త డేట్ ప్రకటించే అవకాశం ఉంది.

    తెలంగాణలో జూన్ 8 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసిన నేపథ్యంలో కొందరు హైకోర్టును ఆశ్రయించారు.  ప్రభుత్వం కేవలం పరీక్సల మీద దృష్టి పెట్టిందే కానీ, విద్యార్థుల ప్రాణాల మీద దృష్టి పెట్టలేదని వాదించారు. పంజాబ్ తరహాలోపరీక్షలు లేకుండానే గ్రేడ్లు ఇచ్చే విధానాన్ని పరీశీలించాలని కోరారు. ఈ క్రమంలో హైకోర్టు కొన్ని ప్రశ్నలను తెలంగాణ ప్రభుత్వానికి వేసింది. ప్రస్తుతం కరోనా వల్ల హైదరాబాద్‌లో పరీక్షలకు హాజరుకాలేకపోయిన వారికి సప్లిమెంటరీలో అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. వారిని కూడా రెగ్యులర్ కిందే పరిగణిస్తామని హామీ ఇచ్చింది.

    జీహెచ్ఎంసీ మినహా మిగిలిన చోట్ల పరీక్షలు నిర్వహిస్తే అభ్యంతరం ఏంటని కోర్టు ప్రశ్నించింది. దాని వల్ల సాంకేతిక సమస్యలు వస్తాయన్న ఏజీ వాదనతో కోర్టు అంగీకరించలేదు. విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ మినహా మిగిలిన చోట్ల పరీక్షలు నిర్వహించే అంశంపై ప్రభుత్వంతో చర్చించిన తర్వాత అది సాధ్యం కాదని ఏజీ కోర్టుకు తెలిపారు. విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకున్న కోర్టు జీహెచ్ఎంసీ మినహా మిగిలినచోట్ల పరీక్షల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ఈక్రమంలో రెండుసార్లు నిర్వహించడం కష్టమనే ఉద్దేశంతో ప్రభుత్వం మొత్తానికి వాయిదా వేసింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Ssc exams, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు