ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సహా 2,476 ఉద్యోగాల ఫలితాలు విడుదల

ఒకే రోజు 2,476 నియామక ఫలితాలను ప్రకటించింది టీఎస్‌పీఎస్సీ. ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు 1,857 మందిని, టీఆర్టీ సోషల్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు 653, గురుకులాల్లో టీజీటీ సైన్స్‌ ఉద్యోగాలకు 52 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు.

news18-telugu
Updated: February 12, 2019, 10:12 PM IST
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సహా 2,476 ఉద్యోగాల ఫలితాలు విడుదల
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 12, 2019, 10:12 PM IST
ఉద్యోగ నియామక పరీక్షలు రాసి నెలలు గడుస్తున్నాయి. కొన్ని కోర్టు కేసుల్లో పెండింగ్ ఉండడంతో పాటు మరికొన్ని సాంకేతికంగా ఆలస్యమయ్యాయి. ఈ నేపథ్యంలో పరీక్షా ఫలితాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఉద్యోగ అభ్యర్థులు. అలాంటి వారిందరికీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ అందించింది. ఒకే రోజు 2,476 నియామక ఫలితాలను ప్రకటించింది. ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు 1,857 మందిని, టీఆర్టీ సోషల్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు 653, గురుకులాల్లో టీజీటీ సైన్స్‌ ఉద్యోగాలకు 52 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఫలితాల వివరాలను TSPSC వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. కాగా, ఒకే రోజు వివిధ నోటిఫికేషన్లకు చెందిన 2,746 ఉద్యోగాల నియామక పరీక్షా ఫలితాలను వెల్లడించి రికార్డ్ సృష్టించింది. కాగా, ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలతో టీఎస్పీఎస్సీ 20వేల నియామకాల మైలురాయి దాటిందని అధికారులు తెలిపారు.First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...