పంచాయితీరాజ్ శాఖలో కొత్త పోస్టుల మంజూరు...త్వరలో భర్తీ ప్రక్రియ ప్రారంభం

Telangana Govt Jobs | తెలంగాణ పంజాయితీరాజ్ శాఖలో 311 పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

news18-telugu
Updated: August 22, 2019, 11:17 PM IST
పంచాయితీరాజ్ శాఖలో కొత్త పోస్టుల మంజూరు...త్వరలో భర్తీ ప్రక్రియ ప్రారంభం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మరో తీపికబురు.  పంచాయతీరాజ్ శాఖలో కొత్తగా 311 పోస్టులు మంజూరయ్యాయి.  త్వరలో ఈ కొత్త  పోస్టులను భర్తీ చేయనున్నారు.  జిల్లా, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో 311 కొత్త పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటైన నేపథ్యంలో పంచాయితీరాజ్ శాఖలో ఈ కొత్త పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

పోస్టుల వివరాలు:

ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు-23, డిప్యూటీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు-23, జిల్లా పంచాయతీ అధికారులు-23, డివిజనల్ పంచాయతీ అధికారి పోస్టులు- 40, మండల పరిషత్తు అభివృద్ధి అధికారులు (ఎంపీడీవో)-101, మండల పంచాయతీ అధికారులు-101.

First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>