TELANGANA GOVT JOBS 2022 KNOW HOW TO DO ONE TIME REGISTRATION ON TELANGANA STATE PUBLIC SERVICE COMMISSION PORTAL SS
Telangana Govt Jobs: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ వచ్చేస్తున్నాయి... ఇలా రిజిస్టర్ చేసుకోండి
Telangana Govt Jobs: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ వచ్చేస్తున్నాయి... ఇలా రిజిస్టర్ చేసుకోండి
(image: TSPSC)
Telangana Govt Jobs | తెలంగాణ ప్రభుత్వం 80,039 పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల చేయనుంది. అభ్యర్థులు ముందుగానే రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
తెలంగాణ ప్రభుత్వం 80,039 ఖాళీలను (Telangana Govt Jobs) భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయబోతోంది. తెలంగాణ ప్రభుత్వంలోని విభాగాలు, శాఖల్లో ఈ ఖాళీల భర్తీకి నేటి నుంచి జాబ్ నోటిఫికేషన్స్ (Job Notifications) రానున్నాయి. చాలావరకు ఈ నోటిఫికేషన్స్‌ని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రిలీజ్ చేయనుంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకాలను టీఎస్‌పీఎస్‌సీ చేపట్టింది. ఇకపై టీఎస్‌పీఎస్‌సీ నుంచి వరుసగా నోటిఫికేషన్స్ రానున్నాయి. అభ్యర్థులు టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లోనే ఆన్‌లైన్‌లో నోటిఫికేషన్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అయితే అంతకన్నా ముందు టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (TSPSC OTR) చేయాల్సి ఉంటుంది. మరి టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలుసుకోండి.
Step 2- హోమ్ పేజీలో కుడివైపు One Time Registration పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
Step 3- Aadhaar Details సెక్షన్‌లో మొదట ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు ఎంటర్ చేయాలి.
Step 4- Personal Details సెక్షన్‌లో ఎస్ఎస్‌సీ లేదా తత్సమాన సర్టిఫికెట్‌లో ఉన్నట్టుగా పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు, ఐడెంటిఫికేషన్ మార్క్స్ లాంటి వివరాలన్ని ఎంటర్ చేయాలి.
Step 5- Address Details సెక్షన్‌లో పోస్టల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
Step 6- Educational Qualifications సెక్షన్‌లో విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
Step 7- మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పీహెచ్‌డీ లాంటి అర్హతలకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేసి సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.
Step 8- Additional Qualifications సెక్షన్‌లో అదనపు అర్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
Step 9- ఫోటో సంతకం అప్‌లోడ్ చేయాలి.
Step 10- Notification Alerts ఆన్‌లో పెడితే ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం లభిస్తుంది.
Step 11- ఆ తర్వాత Preview క్లిక్ చేసి వివరాలన్నీ సరిచూసుకోవాలి.
Step 12- ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే TSPSC ID జనరేట్ అవుతుంది.
టీఎస్‌పీఎస్‌సీ ఏ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసినా TSPSC ID ఎంటర్ చేసి అప్లై చేయొచ్చు. ప్రతీ నోటిఫికేషన్‌కు అన్ని వివరాలు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖలు, విభాగాల్లో ఉన్న 80,039 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం News18 Telugu వెబ్‌సైట్ ఫాలో కావాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.