తెలంగాణలోని భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. అసెంబ్లీ సాక్షిగా 91,142 ఖాళీలు ఉన్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. వీటిలో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ చేయగా మిగిలిన 80,039 ఉద్యోగాలకు బుధవారం నుంచి నోటిఫికేషన్లు వస్తాయని తెలిపారు. అయితే మొత్తం జాబ్ నోటిఫికేషన్స్ (Job Notifications) ఒకసారే వస్తాయా? లేక విడతల వారీగా వస్తాయా? అన్న సందేహాలు నిరుద్యోగుల్లో ఉన్నాయి. అయితే సీఎం కేసీఆర్ ప్రసంగంలోనే దీనిపై స్పష్టత ఉంది. ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ
పడేందుకు వీలుగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అంటే అన్ని నోటిఫికేషన్స్ ఒకేసారి కాకుండా విడతల వారీగా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక రిజర్వేషన్ రూల్స్ చూస్తే పోలిస్ శాఖ లాంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని పదేండ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల మరింతమంది ఉద్యోగార్జులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఈ నిర్ణయం వల్ల ఓసీలకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్ల వరకు వయోపరిమితి పెరుగుతోంది. దీంతో ఉద్యోగాలకు పోటీపడేవారి సంఖ్య పెరగనుంది.
Telangana Govt Jobs: తెలంగాణలో 80,039 ప్రభుత్వ ఉద్యోగాలు... శాఖలవారీగా ఖాళీల వివరాలివే
ఇకపై ఖాళీలను ముందుగానే గుర్తించి ప్రతీ సంవత్సరం ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి, పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని విభాగాలు తమ వద్ద ప్రతీ సంవత్సరం ఏర్పడే ఖాళీల వివరాలు సిద్దం చేస్తాయి. నోటిఫికేషన్ల జారీ కోసం ఆయా నియామక సంస్థలకు సమాచారం ఇస్తాయి.
ఇకపై భర్తీ చేసే ఉద్యోగాల్లో లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 95 శాతం ఉద్యోగాలకు స్థానికులే పోటీపడొచ్చు. సొంత జిల్లా, సొంత జోన్, మల్టీ జోన్లలో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయి. ఇతర జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్‌లో 5 శాతం ఉద్యోగాలకు నాన్ లోకల్ అభ్యర్థులు పోటీపడొచ్చు. శాఖలవారీగా ఖాళీల వివరాలు ఇక్కడ చూడొచ్చు.
Telangana Govt Jobs: తెలంగాణలో 91,142 ప్రభుత్వ ఉద్యోగాలు... నేటి నుంచే నోటిఫికేషన్లు
మొత్తం- 80,039
హోమ్ శాఖ- 18,334
సెకండరీ ఎడ్యుకేషన్- 13,086
హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్పేర్- 12,755
హయ్యర్ ఎడ్యుకేషన్- 7,878
బీసీ సంక్షోమం- 4,311
రెవెన్యూ డిపార్ట్‌మెంట్- 3,560
షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్- 2,879
ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్- 2,692
ట్రైబల్ వెల్ఫేర్- 2,399
మైనారిటీస్ వెల్ఫేర్- 1,825
ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్,సైన్స్ అండ్ టెక్నాలజీ- 1,598
పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్- 1,455
లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్- 1,221
ఫైనాన్స్- 1,146
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్- 895
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్- 859
అగ్రికల్చర్ అండ్ కో-ఆపరేషన్- 801
ట్రాన్స్‌పోర్ట్, రోడ్స్, బిల్డింగ్స్ డిపార్ట్‌మెంట్- 563
న్యాయ శాఖ- 386
పశుపోషణ, మత్స్య విభాగం- 353
జనరల్ అడ్మినిస్ట్రేషన్- 343
ఇండస్ట్రీస్ అండ్ కామర్స్- 233
యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం, కల్చర్- 184
ప్లానింగ్- 136
ఫుడ్ అండ్ సివిల్ సప్లయిస్- 106
లెజిస్లేచర్- 25
ఎనర్జీ- 16
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Govt Jobs 2022, JOBS, State Government Jobs, Telangana government jobs