TELANGANA GOVT INVITES APPLICATIONS FOR POST MATRIC SCHOLARSHIPS FOR UNDERPRIVILEGED STUDENTS KNOW FULL DETAILS HERE GH VB
TS Government: విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న స్కాలర్షిప్స్ అర్హత, ఇతర వివరాలిలా..
ప్రతీకాత్మక చిత్రం
రాష్ట్రంలోని ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్ (PMS)లను మంజూరు చేయనుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మే11 నుంచి ప్రారంభించింది.
రాష్ట్రంలోని ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం(Government) పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్ (PMS)లను మంజూరు చేయనుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్(Registration) ప్రక్రియను మే11 నుంచి ప్రారంభించింది. అర్హులైన విద్యార్థులు ప్రభుత్వ వెబ్సైట్ ఇ- పాస్ పోర్టల్ telanganaepass.cgg.gov.in ద్వారా మే 21లోపు దరఖాస్తు చేసుకోవాలి. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెన్యువల్‌తో పాటు తాజా స్కాలర్‌షిప్‌ల మంజూరు కోసం ఇ-పాస్ వెబ్సైట్లో(Website) నమోదు చేసుకోవాలనుకునే విద్యార్థులు తమ డేటాను అక్టోబర్ 24లోపు అప్లోడ్ చేయాలి.
రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వెనుకబడిన తరగతులు(BC), ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (EBC), మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వికలాంగ విద్యార్థులు కూడా అర్హులే.
* అర్హత ప్రమాణాలు
స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల అర్హత ప్రమాణాలు ఇలా ఉన్నాయి. విద్యార్థులు కచ్చితంగా మెట్రిక్ లేదా పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. SC లేదా ST వర్గానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ.2 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. BC, EBC, లేదా వికలాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలంటే వారి తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ.1 లక్ష లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే విద్యార్థి హాజరు శాతం ప్రతి త్రైమాసికం చివరిలో 75%గా ఉండాలి. అవసరమైన డాక్యుమెంట్లుపోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల (PMS) కోసం దరఖాస్తుదారులు క్వాలిఫైయింగ్ పరీక్ష మార్క్ షీట్‌తో పాటు ఆధార్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు వివరాలకు సంబంధించి పాస్ బుక్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో సమర్పించాల్సి ఉంటుంది.
స్టెప్-4: పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సేవలను సెలక్ట్ చేయండి.
స్టెప్-5: అన్ని వివరాలతో అప్లికేషన్ పూరించి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి
స్టెప్-6: అన్ని వివరాలను నమోదు చేసిన తరువాత అభ్యర్థులు తప్పనిసరిగా అప్లికేషన్‌ను రివ్యూ చేయాలి. చివరగా కోడ్‌ను ఎంటర్ చేసి అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
స్టెప్-7: చివరగా దరఖాస్తు ఫారమ్ ప్రింటౌట్ తీసుకోవాలి. హార్డ్ కాపీని సంబంధిత పాఠశాల లేదా కళాశాలకు సమర్పించాలి. తప్పుడు సమాచారం నమోదు చేస్తే దరఖాస్తులను తిరస్కరించే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఎంతో జాగ్రత్తగా వివరాలను నమోదు చేయాలి.
10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తరువాత 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్, ప్రొఫెషనల్ కోర్సులు, గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు, PhD, సాంకేతిక విద్య, ITI సహా ఉన్నత చదువులు అభ్యసించడానికి సుముఖంగా ఉన్న విద్యార్థుల కోసం ఈ పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్(PMS)లను ప్రవేశపెట్టారు. స్కాలర్షిప్ పొందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చేయనున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.