తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు.. ఆల్ పాస్...

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

  • Share this:
    తెలంగాణలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. సప్లిమెంటరీ రద్దు ప్రకటనకు సంబంధించి ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇంటర్ సెకండియర్ లో 1.47లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. గతంలో పాస్ అయిన వారు, ఫెయిల్ అయిన వారు రీ వెరిఫికేషన్ కోసం అప్లై చేయమని చెప్పారు. అందులో 73వేల మంది రీ వెరిఫికేషన్ కోసం అప్లై చేశారు. వారి దరఖాస్తులను పరిశీలించి వారం రోజుల్లో కౌంటింగ్ రీ వెరిఫికేషన్ చేసి రిజల్ట్స్ ఇస్తారు. సెకండియర్‌లో ఫెయిల్ అయిన వారిని పాస్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. వారంతా కంపార్ట్‌మెంట్‌లో పాస్ అయినట్టు జాబితాలో పేర్కొంటారు. వారందరికీ కూడా ఈనెల 31 వరకు కాలేజీల్లో మెమోలు తీసుకోవచ్చు.

    కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు తొలి దశలోనే 1 నుంచి 9 వరకు విద్యార్థులను పాస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. కొన్ని రోజుల క్రితం పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించే అవకాశం లేదు కాబట్టి అందరినీ పాస్ చేస్తున్నట్టు సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: