తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన మేరకు 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యంగా నియామక సంస్థలు నోటిఫికేషన్లను (Telangana Government Jobs Notification) విడుదల చేస్తున్నాయి. నిత్యం రెండు, మూడు నోటిఫికేషన్లు కూడా విడుదల అవుతుండడంతో నిరుద్యోగ వర్గాల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పోలీస్, గ్రూప్-1 తదితర ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా ప్రారంభం కాగా.. గ్రూప్-2, 3, 4, జేఎల్, స్టాఫ్ నర్స్, పాలిటెక్నికల్ లెక్చరర్ తదితర అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అయితే.. ఎక్కువ మంది నిరుద్యోగులు ఎదురు చూసే నోటిఫికేషన్లలో టీచర్ జాబ్స్ (Teacher Jobs) ఒకటి. ఈ నోటిఫికేషన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఆయా అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే.. ఆయా ఆ అభ్యర్థులకు కూడా గుడ్ న్యూస్ చెప్పేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో దాదాపు 9,256 ఖాళీల (TS Gurukul Jobs) భర్తీకి కసరత్తును వేగవంతం చేశారు అధికారులు. ఈ పోస్టులు గతంలోనే మంజూరయ్యాయి. అయితే.. పూర్తి స్థాయిలో పోస్టుల గుర్తింపు ఇటీవలే పూర్తయింది. దీంతో భర్తీ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. మొత్తం 9,256 పోస్టుల్లో 546 స్టాఫ్ నర్సు పోస్టులు ఉన్నాయి. ఈ స్టాఫ్ నర్సుల పోస్టులను రాష్ట్ర మెడికల్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. మిగతా 8,710 పోస్టులు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TREIRB) ద్వారా భర్తీ చేయనున్నారు.
Teacher Jobs: ఏపీలో 50,677 ఉపాధ్యాయ ఖాళీలు, తెలంగాణలో 18,588.. వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి
ఈ పోస్టుల్లో అత్యధికంగా మహాత్మ జ్యోతిభాపూలే బీసీ వెల్ఫేర్‌లో 3,673, సోషల్ వెల్ఫేర్‌లో 2,143, ట్రైబల్ వెల్ఫేర్‌లో 1,440, మైనారిటీలో 1,318, ట్రైస్‌లో 93, దివ్యాంగుల వెల్ఫేర్‌లో 43 పోస్టులు ఉన్నాయి. ఇంకా.. బీసీ గురుకులాల్లో గతంలోనే గుర్తించిన దాదాపు 3 వేల పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు అధికారులు. జనవరి రెండో వారంలో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక వేళ సాంకేతిక కారణాలతో ఆలస్యమైనా.. ఈ నెలాఖరుకు మాత్రం ప్రకటన ఖాయం అని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Teacher jobs, Telangana government jobs, Ts gurukula