తెలంగాణలోని నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. తెలంగాణలోని ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 91,142 ఖాళీలు గుర్తించామని, ఈ ఖాళీల భర్తీకి ఈరోజు నుంచే నోటిఫికేషన్లు వస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. బుధవారం నాడు ఉదయం 10 గంటలకు ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన చేస్తానని సీఎం కేసీఆర్ వనపర్తిలో జరిగిన సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నిరుద్యోగులు సీఎం కేసీఆర్ ప్రసంగం కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. తెలంగాణలోని ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 91,142 ఖాళీలు గుర్తించామని చెప్పారు. ఈ ఉద్యోగాలకు ఈ రోజు నుంచే నోటిఫికేషన్లు వస్తాయన్నారు. వీటిలో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ చేస్తున్నామని ప్రకటించారు.
మిగిలిన 80,039 ఉద్యోగాలకు బుధవారం నుంచి ఆయా శాఖలు నోటిఫికేషన్లు జారీ చేయనున్నాయి. వీటిలో విద్యా శాఖలోనే 30,000 పైగా ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటించడం విశేషం. ఉద్యోగాల్లో లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయని ప్రకటించారు. స్థానిక అభ్యర్థులు సొంత జిల్లా, సొంత జోన్, మల్టీ జోన్లలో 95 శాతం ఉద్యోగాలు పొందొచ్చు. దీంతోపాటు అభ్యర్థులు ఇతర జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్‌లో 5 శాతం ఉద్యోగాలకు పోటీ పడొచ్చని తెలిపారు. గతం కన్నా ఎక్కువ అవకాశాలు లభిస్తాయని కేసీఆర్ ప్రకటించారు. శాఖల వారీగా ఖాళీల వివరాలు ఇక్కడ చూడొచ్చు.
మొత్తం- 80,039
హోమ్ శాఖ- 18,334
సెకండరీ ఎడ్యుకేషన్- 13,086
హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్పేర్- 12,755
హయ్యర్ ఎడ్యుకేషన్- 7,878
బీసీ సంక్షోమం- 4,311
రెవెన్యూ డిపార్ట్‌మెంట్- 3,560
షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్- 2,879
ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్- 2,692
ట్రైబల్ వెల్ఫేర్- 2,399
మైనారిటీస్ వెల్ఫేర్- 1,825
ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్,సైన్స్ అండ్ టెక్నాలజీ- 1,598
పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్- 1,455
లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్- 1,221
ఫైనాన్స్- 1,146
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్- 895
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్- 859
అగ్రికల్చర్ అండ్ కో-ఆపరేషన్- 801
ట్రాన్స్‌పోర్ట్, రోడ్స్, బిల్డింగ్స్ డిపార్ట్‌మెంట్- 563
న్యాయ శాఖ- 386
పశుపోషణ, మత్స్య విభాగం- 353
జనరల్ అడ్మినిస్ట్రేషన్- 343
ఇండస్ట్రీస్ అండ్ కామర్స్- 233
యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం, కల్చర్- 184
ప్లానింగ్- 136
ఫుడ్ అండ్ సివిల్ సప్లయిస్- 106
లెజిస్లేచర్- 25
ఎనర్జీ- 16
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Govt Jobs 2022, JOBS, State Government Jobs, Telangana government jobs