Telangana: వారందరికీ గుడ్ న్యూస్.. మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ సర్కార్.. వివరాలివే

సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సరి కొత్త పథకం దిశగా అడుగులు వేస్తోంది. మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకు రానుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సరి కొత్త పథకం దిశగా అడుగులు వేస్తోంది. మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ పథకన్ని ప్రభుత్వం తీసుకు రానుంది. ఈ పథకం ద్వారా మహిళలకు మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలను సర్కార్ త్వరలోనే పంపిణీ చేయనుంది. ఈ వాహనాల ద్వరా చేపలతో తయారు చేసిన వంటలను విక్రయించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 150 సంచార చేపల విక్రయ వాహనాలను ఈ పథకం ద్వారా అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. ఈ వాహనం ధర రూ.10 లక్షలు కాగా, ప్రభుత్వం 60 శాతం సబ్సిడీతో మహిళలకు అందించనుంది. చేపలను, చేపల వంటకాలను కావాల్సిన వారి వద్దకు చేర్చడం, తద్వరా మహిళలకు ఉపాధి లభించేలా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది.

    ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఉచితంగా చేప పిల్లలను ప్రభుత్వమే అందిస్తోంది. మత్స్యకారులకు వివిధ రకాల వాహనాలను సైతం సర్కారు ఇప్పటికే అందించింది. ఈ ఏడాది వర్షాలు భారీగా కురవడం, కాలువల ద్వారా నీటిని విడుదల చేయడం ద్వారా చెరువులు, ఇతర జలాశయాల్లో భారీగా నీరు చేరింది. దీంతో మత్స్య సంపద సైతం భారీగా పెరిగింది. దీంతో మత్స్యకారులకు భారీగా ఉపాధి లభిస్తోంది. ఈ నేపథ్యంలో వారు పట్టిన చేపలకు డిమాండ్ కల్పించేందుకు ప్రభుత్వం ఈ మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలను ప్రభుత్వం అందించేందుకు నిర్ణయించింది.

    ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే శుభవార్త వినే అవకాశముంది. ఉద్యోగుల మూల వేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని వేతన సవరణ సంఘం (PRC) ప్రతిపాదించింది. ఉద్యోగుల కనీస వేతనం 19వేలుగా  ఉండాలని. . గరిష్ట వేతనం 1,62,070 వరకు  ఉండవచ్చని తెలిపింది.  దీంతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కూడా 60 ఏళ్లకు పెంచాలని పీఆర్సీ ప్రతిపాదించింది. 2018 జులై 1 నుంచి ఈ వేతన సవరణ అమలుకు కమిషన్‌ సిఫార్సు చేసింది. ఇటీవలే ప్రభుత్వానికి పీఆర్సీ సమర్పించిన ఈ నివేదికను ఉద్యోగ సంఘాలకు అందజేయనుంది ప్రభుత్వం. అనంంతరం పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాలతో అధికారులు చర్చించనున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published: