Haribabu, News18, Rajanna Sircilla
రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District news) నిరుద్యోగులకుశుభవార్త. ఇన్ని రోజులు జాబ్ లేకుండా ఖాళీగా ఉన్నారా? అయితే ఇది మీ కోసమే జాబ్ మేళా..! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఉపాధి కార్యాలయాల ద్వారా జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ బ్యాంకులు, ఇతర సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేయిస్తోంది. ఇంటర్, డిగ్రీ అర్హతతో ఆయా సంస్థలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్, అక్వా వాటర్ ప్యూరిఫైర్ కంపెనీల్లో క్యాషియర్, ఫ్రంట్ ఆఫీస్,సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల ఎంపిక శుక్రవారం మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి నీల రాఘవేందర్ ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగులు తమ విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలతో గాంధీనగర్‌లోని వాసం ఫర్నీచర్స్ వెనుకగల డేటాప్రో కంప్యూటర్స్‌లో హాజరు కావాలన్నారు.
వివరాలకు 81067 64653, 9849586778 సంప్రదించాలన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేంద్ర పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో... విద్యార్హతలు... ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి విద్యార్థులకు నెలకు 10,000వేల నుంచి18,000 వరకు వేతనం ఉంటుందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అర్హత ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకులు వారి వారి బయోడేటా విద్యార్హత సర్టిఫికెట్స్, జిరాక్స్ కాపీలతో ఈనెల 18న జిల్లా కేంద్రంలోని డేటా ప్రో కంప్యూటర్స్ సిరిసిల్లలో ఇంటర్వ్యూ ఉంటుందని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job Mela, Local News, Siricilla, Telangana