TS EAMCET 2020: ఎంసెట్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ నిబంధన రద్దు

తెలంగాణలో ఎంసెట్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

news18-telugu
Updated: October 29, 2020, 8:34 PM IST
TS EAMCET 2020: ఎంసెట్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ నిబంధన రద్దు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో ఎంసెట్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇంటర్ లో 45 శాతం మార్కులు ఉంటేనే ఎంసెట్ కౌన్సెలింగ్ లో పాల్గొనే అవకాశం ఉండేది. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ప్రభుత్వం సప్లమెంటరీ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారందరినీ 35 శాతం మార్కులతో పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలో అలాంటి విద్యార్థులంతా కౌన్సెలింగ్ కు హాజరయ్యే అవకాశాన్ని కోల్పోయారు. వారంతా హై కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ రోజు జరగాల్సిన రెండో విడత కౌన్సెలింగ్ ను వాయిదా వేయాలని జేఎన్టీయూను కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ దృష్ట్య సానుకూలంగా స్పందించింది. ఎంసెట్ లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేస్తు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఇంటర్ పాసై.. ఎంసెట్ లో అర్హత సాధించిన విద్యార్థులంతా ఎంసెట్ కౌన్సెలింగ్ కు హాజరయ్యే అవకాశం ఏర్పడింది.

ఎంసెట్ కౌన్సెలింగ్ పై తెలంగాణ హై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి జరగాల్సిన రెండో విడత‌ కౌన్సెలింగ్‌ను ఆపేయాలని జేఎన్‌టీయూకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా.. ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లించి పరీక్షలు‌ రాయలేకపోయిన, పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించలేక పోయిన విద్యార్థులకు తెలంగాణ ఇంటర్‌ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించలేదు. అలాంటి విద్యార్థులకు 35 శాతం మార్కులు వచ్చినట్లుగా పరిగణించి పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఎంసెట్‌ నిబంధనలకు అనుగుణంగా వారికి 45 శాతం మార్కులు రాలేదు. దీంతో వారంతా కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కోల్పోయారు. ఈ నేపథ్యంలో వారంతా హైకోర్టును ఆశ్రయించారు. తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు విన్నవించారు. ఈ అంశంపై విచారణ నిర్వహించిన కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బుధవారం జస్టిస్‌ పి.నవీన్‌రావు ఈ పిటీషన్ ను విచారించారు.

అయితే విచారణ సందర్భంగా.. పిటీషన్ దాఖలు చేసిన విద్యార్థుల మాదిరిగా 35 శాతం మార్కులు వచ్చిన వారిని సైతం రెండో విడత కౌన్సెలింగ్ కు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసే వరకు కౌన్సెలింగ్‌ వాయిదా వేయాలని జేఎన్టీయూకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎంసెట్‌ పరీక్షను నిర్వహిస్తున్న జేఎన్‌టీయూకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఇదిలా ఉంటే.. 40/45 శాతం మార్కులు వస్తేనే ఎంసెట్ కౌన్సెలింగ్ కు హాజరు కావాలన్న నిబంధనను సవరిస్తామని  ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్ కోర్టకు హామీ ఇచ్చారు.
Published by: Nikhil Kumar S
First published: October 29, 2020, 7:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading