• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • TELANGANA GOVERNMENT SHOCK TO EMPLOYEES OVER SALARY HIKE HERE FULL DETAILS NS

Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. మళ్లీ నిరాశే.. పూర్తి వివరాలివే..

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల విషయంలో మరో సారి తీవ్ర నిరాశ ఎదురు కానుంది. జూన్ నెలలోనూ వారు పాత వేతనాలనే అందుకోనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల కూడా వేతనాల విషయంలో నిరాశ తప్పేలా కనిపించడం లేదు. ఎన్నో ఆందోళనలు, అనేక వాయిదాలు, సుధీర్ఘ నిరీక్షణ అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని ఉద్యోగుల వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ ను అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఈ పెంచిన వేతనాలను ఏప్రిల్ నుంచి వర్తించేస్తామని ఆసమయంలో సీఎం స్వయంగా ప్రకటించారు. అయితే.. మే 1న తీసుకునే వేతనంలో పెరిగిన జీతం ఉద్యోగులకు అందాల్సి ఉంది. అయితే సీఎం కేసీఆర్ కు కరోనా సోకడంతో వేతనాల పెంపు ఫైల్ పై ఆయన సంతకం చేయలేదు. దీంతో మేలోలో పెరిగిన వేతనాలను ఉద్యోగులకు అందుకోలేకపోయారు. అయితే ఈ నెలలో ఎట్టిపరిస్థితుల్లోనూ వేతనాల పెంపు అమల్లోకి వస్తుందని అంతా భావించారు.
    Telangana: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. వాటి ధరలు నిర్ణయించాలంటూ..

    అయితే.. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ వేతనాల పెంపుకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేయలేదు. దీంతో జూన్ 1న కూడా ఉద్యోగులు పాత వేతనాలనే అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన బిల్లులను తయారు చేయడం, వాటిని ట్రెజరీలకు పంపించడం లాంటి పనులను 20వ తేదీ వరకు పూర్తి చేస్తారు. అయితే ఇప్పటి వరకు ఫిట్ మెంట్ కు సంబంధించిన పెంపు ఫైల్ పై సీఎం సంతకం చేయకపోవడంతో మే నెలకు కూడా పాత వేతనాల ప్రకారమే బిల్లులను రూపొందిస్తున్నారు అధికారులు.

    దీంతో జూన్ లోనూ పాత వేతనాలే ఉద్యోగులకు అందనున్నాయి. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా ఉండడంతో సర్కార్ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ రాబడి తగ్గింది. ఈ నేపథ్యంలోనే వేతనాల పెంపును తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిసింది. పరిస్థితులు చక్కబడిన అనంతరమే వేతనాల పెంపు ఫైల్ పై సీఎం సంతకం చేస్తారన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.

    ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా కట్టడిపై సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా రోగులకు అవసరమైన 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను 48 ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంటును హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలను జారీ చేశారు. 16 మెట్రిక్ టన్నుల ప్లాంట్లు 6 యూనిట్లు, 8 మెట్రిక్ టన్నుల ప్లాంట్లు 15 యూనిట్లు, 4 మెట్రిక్ టన్నుల ప్లాంట్లు 27 యూనిట్లు హైదరాబాద్ లో, జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయాలన్నారు. కరోనాతో చికిత్స పొందుతున్న రోగులకు అత్యవసరమైన ఆక్సిజన్ విషయంలో రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల మీద ఆధారపడే పరిస్థితి ఉండొద్దని సీఎం అధికారులకు స్పష్టం చేశారు.
    Published by:Nikhil Kumar S
    First published: