Home /News /jobs /

TELANGANA GOVERNMENT SETTING UP CENTRALIZED COMMON RECRUITMENT BOARD TO FILL VACANCIES IN UNIVERSITIES SS

Telangana Govt Jobs: అన్ని యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి కామన్ బోర్డు ఏర్పాటు

Telangana Govt Jobs: అన్ని యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి కామన్ బోర్డు ఏర్పాటు
(ప్రతీకాత్మక చిత్రం)

Telangana Govt Jobs: అన్ని యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి కామన్ బోర్డు ఏర్పాటు (ప్రతీకాత్మక చిత్రం)

Telangana Govt Jobs | తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు (Common Recruitment Board) ఏర్పాటు కానుంది.

తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో (Telangana University's) ఖాళీల భర్తీకి సెంట్రలైజ్డ్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు (Common Recruitment Board) ఏర్పాటు కానుంది. విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీని (Teaching And Non-Teaching Jobs) ఈ బోర్డు చేపట్టనుంది. ప్రస్తుతం యూనివర్సిటీలు (University) వేర్వేరుగా ఖాళీలను భర్తీ చేస్తున్నాయి. వేర్వేరుగా కాకుండా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఖాళీలను (Jobs) ఒకే బోర్డు ద్వారా ఒకేసారి భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలో ప్రస్తుతం మెడికల్ యూనివర్సిటీలు కాకుండా 15 విశ్వవిద్యాలయాలున్నాయి. ఈ విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాత నియామకాలు చేపడుతున్నాయి విశ్వవిద్యాలయాలు. వేర్వేరుగా రిక్రూట్‌మెంట్స్ చేయడం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. నిరుద్యోగులు కూడా ప్రతీ యూనివర్సిటీకి అప్లై చేయాల్సి వస్తోంది.

Govt Jobs with Intermediate: ఇంటర్ పాసయ్యారా? ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే

ఇలా పలు అంశాలను, సమస్యల్ని పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో నియామకాలు వేర్వేరుగా కాకుండా ఈ 15 యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ ఒకే బోర్డు ద్వారా జరపాలని భావించింది. అందుకే కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఉంటారు. కన్వీనర్‌గా కళాశాల విద్యా శాఖ కమిషన్ మెంబర్ ఉంటారు. ఆర్థిక శాఖ, విద్యాశాఖ అధికారులు బోర్డు సభ్యులుగా ఉంటారు.

కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు విధివిధానాలు ఎలా ఉంటాయన్నదానిపై గైడ్‌లైన్స్ త్వరలో విడుదల కానున్నాయి. ఈ బోర్డు పనిచేయడానికి అయ్యే ఖర్చుల్ని తెలంగాణ ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీలు సమానంగా భరిస్తాయి. ఈ బోర్డు ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీ చట్టాల్లో సవరణల్ని కూడా ప్రతిపాదించనుంది ప్రభుత్వం.

Coal India Recruitment 2022: నెలకు రూ.50,000 వేతనంతో కోల్ ఇండియాలో 1050 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయాలు చూస్తే ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ లాంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. త్వరలో ఈ విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ ఒకే నోటిఫికేషన్ ద్వారా జరగనుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: JOBS, Kakatiya university, Osmania University, State Government Jobs, Teaching, University

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు