తెలంగాణలో ఉద్యోగల (Telangana Government Jobs) భర్తీ జాతర కొనసాగుతోంది. వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనలు నిత్యం ఏదో ఒకటి వస్తుండడంతో నిరుద్యోగుల్లో సందడి వాతావరణం నెలకొంది. వాస్తవానికి సీఎం కేసీఆర్ 80 వేల ఉద్యోగాలను (Jobs) భర్తీ చేస్తామని ప్రకటించినా.. ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రకటనలు ప్రకటిస్తుంటే ఆ సంఖ్య లక్ష దాటే అవకాశం ఉంది. మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో 7 వేలకు పైగా కొత్త ఖాళీలకు (Jobs) ఆమోదం లభించింది. వివిధ కోర్టుల్లో 4 వేలకు పైగా ఖాళీల భర్తీకి సైతం సర్కార్ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తాజాగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో మరో 879 ఖాళీలు నూతనంగా మంజూరయ్యాయి. ఇరిగేషన్ శాఖ పంపించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదించింది.
ఈ మేరకు బుధవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ నియామకాలను చేపట్టనుంది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన పేస్కేల్, గ్రేడ్లతో పాటు మార్గదర్శకాలను సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను ప్రభుత్వం గతంలో ఆదేశించింది. ఈ మేరకు అధికారులు పంపించిన ప్రతిపాదనలు ఆమోదించిన ప్రభుత్వం.. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను బుధవారం ఆమోదించింది. దీంతో ఇందుకు సంబంధించిన నియామక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలన్న లక్ష్యంతో అధికారులు ఉన్నారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటన మేరకు వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ నెలలో ఇప్పటికే గ్రూప్-4 తో పాటు పాలిటెక్నిక్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదలయ్యాయి. తాజాగా మరో భారీ జాబ్ నోటిఫికేషన్ (Telangana Job Notification) విడుదలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తోన్న ప్రభుత్వం.. 4 వేలకు పైగా నర్సు (TS Nurse Jobs) పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు మరో వారంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(MHSRB) ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే.. రాత పరీక్ష నిర్వహణ బాధ్యతను మాత్రం జేఎన్టీయూకు అప్పటించే అవకాశం ఉంది. మొత్తం 4,722 నర్సు పోస్టులను భర్తీ చేయనుండగా.. ఇందులో డీఎంఈ పరిధిలో 3823, తెలంగాణ వైద్యవిధాన పరిషత్ పరిధిలో 757, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో 81, ఆయుష్ విభాగంలో మరో 61 పోస్టులు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, State Government Jobs, Telangana government jobs