Home /News /jobs /

TELANGANA GOVERNMENT RELEASED JOB NOTIFICATION FOR VARIOUS JOB VACANCIES IN NATIONAL HEALTH MISSION NS

Telangana Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. నేషనల్ హెల్త్ మిషన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నెలకు రూ. 36 వేల వేతనం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) లో ఉద్యోగాల భర్తీకి అధికారులు తాజాగా నోటిఫికేషన్ (Telangana Job Notification) విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  కమిషనరేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, నేషనల్ హెల్త్ మిషన్ (NHM), తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం పది ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 7ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

  ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
  బయో మెడికల్ ఇంజనీర్ విభాగంలో 10 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బీఈ/బీటెక్-బయో మెడికల్ ఇంజనీరింగ్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా రెండేళ్ల అనుభవం ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, నల్గొండ జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.36,750 వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
  IOCL Recruitment 2022: నిరుద్యోగులకు IOCL శుభవార్త.. 626 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

  ఎంపిక ప్రక్రియ:
  విద్యార్థులను అకాడమిక్ క్వాలిఫికేషన్ లో మెరిట్, అనుభవం, పర్ఫార్మెన్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. క్వాలిఫికేషన్ కు 50, అనుభవానికి 25, ఇంటర్వ్యూకు 25 మార్కులను కేటాయిస్తారు. ఇలా మొత్తం వంద మార్కులకు గాను అభ్యర్థులు సాధించిన మార్కులను లెక్కించి ఎంపిక చేపడతారు.
  Govt Jobs 2022: ఈ వారం మీరు అప్లై చేయాల్సిన టాప్ 5 ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు

  దరఖాస్తు ప్రక్రియ:
  Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://chfw.telangana.gov.in/home.do ను ఓపెన్ చేయాలి.
  Step 2: అనంతరం అప్లికేషన్ ఫామ్ లింక్ పై క్లిక్ చేయాలి.
  Step 3: అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దానిని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
  Step 4: అప్లికేషన్ ఫామ్ ను పూర్తిగా నింపాలి. పాస్ పోర్ట్ పొటోను అంటించాలి.
  Step 5: అప్లికేషన్ ఫామ్ కు ఓసీలు, బీసీ(నాన్ క్రిమీ లేయర్) అభ్యర్థులు రూ. 500 డీడీని అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇతర అభ్యర్థులు రూ.250 డీడీని జత చేస్తే సరిపోతుంది. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
  Step 6: అప్లికేషన్ ఫామ్ ను పోస్టు ద్వారా లేదా వ్యాక్తిగతంగా The Chief Administrative Officer, O/o Mission Director National Health Mission & CH&FW.,4 th Floor, DME Building, DM&HS Campus, Koti, Hyderabad. చిరునామాకు చేరేలా పంపించాల్సి ఉంటుంది.
  Published by:Nikhil Kumar S
  First published:

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు