తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తాజాగా కీలక ప్రకటన చేసింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని (Nalgonda District) దివ్యాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. దరఖాస్తుకు ఈ నెల 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఖాళీలు విద్యార్హతల వివరాలు ఇలా ఉన్నాయి.
-టైపిస్ట్ విభాగంలో 3 ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆఫీస్ ఆటోమేషన్ మరియుఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్, టైపు రైటింగ్ తెలుగు లో ప్రభుత్వ స్టాండర్డ్ కీ బోర్డ్ హైర్ గ్రేడ్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
జూనియర్ అకౌంట్: ఈ విభాగంలో 3 ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మరియు కంప్యూటర్ ఆఫీస్ అటోమేషన్ ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్ విభాగంలో మూడు ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ ఉండాలి. వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
ఆఫీస్ సబార్డినేట్: మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. ఏడో తరగతి పాసైన వారు అప్లై చేసుకోవచ్చు.
డార్క్ రూం అసిస్టెంట్: టెన్త్ పాసనై అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ విభాగంలో 1 ఖాళీల ఉంది.
-ఇంకా వాచ్ మెన్ విబాగంలో 3. వంటమనిషి విభాగంలో 1, పబ్లిక్ హెల్త్ వర్కర్ విభాగంలో 5, వాటర్ సప్లై వర్కర్ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి. 5 వ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
ఇతర వివరాలు:
1. అభ్యర్ధి వయస్సు 01-07-2021 నాటికి 18 సంవత్సరముల పైబడి 44 సంవత్సరములు లోపు ఉండాలి.
2) జిల్లా మెడికల్ బోర్డు వారిచే జారీ చేయబడిన వైధ్య ధృవీకరణ పత్రము (సదరం) తప్పనిసరి.
3) ఒకే అభ్యర్ధి ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసే వారు ప్రతీ పోస్టుకు విడివిడిగా ధరఖాస్తు చేసుకోవాలి.
4) అభ్యర్ధి బయోడేటాతో పాటు తప్పని సరిగా వైధ్య ధృవీకరణ పత్రము (సదరం), విద్యార్హత ధృవీకరణ పత్రాలు, స్థిర నివాస ధృవీకరణ (నేటివిటీ) (అంధులు, బధిరులు తమ సొంత జిల్లాలో చదవనిచో వారి తల్లిదండ్రుల స్థిర నివాస ధృవీకరణ పత్రం తప్పని సరిగా జత చేయవలెను) జిరాక్స్ ప్రతులపై గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయించి ధరఖాస్తుతో పాటు జత చేయాలి.
5) అసంపూర్తిగా ఉన్న ధరఖాస్తులు తిరస్కరించబడును. అలాంటి ధరఖాస్తులపై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు చేయబడవు.
6) G.O.Ms.No. 31, WDCW (DW) Department తేదీ 01-12-2009 ప్రకారం ఏర్పాటు చేయబడిన జిల్లా మెడికల్
బోర్డుచే (సదరం) జారీ చేయబడి దృవీకరణ పత్రంను దరఖాస్తుతో పాటు జతపరచాలి.
7)ఈ ఉద్యోగాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన స్థానిక అభ్యర్ధులు మాత్రమే ధరఖాస్తు చేసుకొనుటకు అర్హులు.
8) పూర్తి చేసిన బయోడేటా ఫారంను అవసరమగు ధృవప్రతాల ప్రతులతో పాటు ఒక పాస్పోర్టు సైజు ఫోటో అతికించి జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు దివ్యాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, సంక్షేమ భవనము, కలెక్టరేట్ కాంప్లెక్స్, నల్లగొండ - 508001 చిరునామాకు పంపించాలి. కవర్ పై దివ్యాంగుల బ్యాక్ లాగు పోస్టుకై దరఖాస్తు అని రాయాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
9. దరఖాస్తును రిజిస్టర్ పోస్టు ద్వారా గాని, వ్యక్తి గతంగా కాని తేది : 27- 01 -2022 సాయంత్రం 5.00 గం. లోగా అందేలా పంపించాలి.
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job notification, Nalgonda, State Government Jobs, Telangana government jobs