TELANGANA GOVERNMENT RELEASED GUIDELINES FOR TRANSFERS AND POSTINGS OF EMPLOYEES TO NEW LOCAL CADRES BY COUNSELLING SS
Transfer Guidelines: ఉద్యోగులకు అలర్ట్... బదిలీలు, పోస్టింగ్‌ల మార్గదర్శకాలు విడుదల
Transfer Guidelines: ఉద్యోగులకు అలర్ట్... బదిలీలు, పోస్టింగ్‌ల మార్గదర్శకాలు విడుదల
(image: Telangana Map)
Transfer Guidelines | తెలంగాణ ప్రభుత్వం కొత్త జోనల్ విధానం ప్రకారం బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన గైడ్‌లైన్స్ విడుదల చేసింది. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించింది.
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్. కొత్త జోనల్ విధానంలో ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లా స్థాయి పోస్టులకు మార్గదర్శకాలను జారీ చేసింది. జోనల్, మల్టీజోనల్ పోస్టులకు విడిగా మార్గదర్శకాలను జారీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు, పోస్టింగుల ప్రక్రియ పూర్తి చేయనుంది. కొత్త స్థానికత ఆధారంగా సీనియారిటీ జాబితా రూపొందించి ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోనుంది ప్రభుత్వం. బదిలీలు, పోస్టింగుల కోసం జిల్లా కలెక్టర్, జిల్లా శాఖాధిపతితో కమిటీ ఏర్పాటు చేయనుంది.
తెలంగాణలో ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌ల ప్రక్రియ వారం రోజుల్లోగా బదిలీల పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బదిలీలు, పోస్టింగుల తర్వాత విధుల్లో చేరేందుకు ఉద్యోగులకు మూడు రోజుల గడువు విధించింది. సీనియారిటీ ఆధారంగా ఉద్యోగులకు కొత్త పోస్టింగులను ఇస్తోంది ప్రభుత్వం. జిల్లా కేడర్ పోస్టులకు హెచ్ఓడీలు ఈ జాబితాను ప్రిపేర్ చేయనున్నారు.
మరోవైపు కొత్త జోనల్ విధానంలో బదిలీలు పూర్తై పోస్టింగ్‌లో చేరిన తర్వాత అప్పీళ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. స్పౌస్ కేసులపైనా అప్పుడే అభ్యర్థనలు స్వీకరిస్తామని తెలిపింది.
తాజా బదిలీలు, పోస్టింగులపై ఉద్యోగులకు అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వానికి అప్పీల్ చేసుకోవచ్చు. అయితే కొత్తగా కేటాయించిన పోస్టులో చేరిన తర్వాతే అప్పీళ్లు స్వీకరించనుంది ప్రభుత్వం. జిల్లా కేడర్ ఉద్యోగులు జిల్లా శాఖాధిపతికి, మల్టీ జోనల్ కేడర్ ఉద్యోగులు వారి శాఖాధిపతులకు అప్పీల్ చేసుకోవచ్చు.
అప్పీళ్లనింటిపైనా ప్రభుత్వం విచారణ జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటుంది. భార్యాభర్తలు ఉద్యోగులు అయితే వారిద్దరికీ ఒకే చోట పోస్టింగ్ ఇచ్చేలా స్పౌస్ కేసులను పరిగణలోకి తీసుకోనుంది ప్రభుత్వం. స్పౌస్ కేసులను కూడా వారికి కేటించిన పోస్టుల్లో చేరిన తర్వాతే పరిశీలిచనుంది.
పోస్టింగ్స్ పూర్తైన తర్వాత అన్ని డిపార్ట్స్మెంట్స్ భర్తీ చేయాల్సిన ఖాళీలను గుర్తించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఖాళీలను గుర్తించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేసే అవకాశం ఉంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.