హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. పెరగనున్న గ్రూప్-2, 3, 4 ఖాళీలు.. జీవో విడుదల చేసిన సర్కార్

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. పెరగనున్న గ్రూప్-2, 3, 4 ఖాళీలు.. జీవో విడుదల చేసిన సర్కార్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలోని నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పరిధిలోకి వచ్చే పోస్టులను సవరించింది. ఈ మేరకు బుధవారం రాత్రి కొత్త జీవో నె.136 జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణలోని నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ (Telangana Government) శుభవార్త చెప్పింది. గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పరిధిలోకి వచ్చే పోస్టులను సవరించింది. ఈ మేరకు బుధవారం రాత్రి కొత్త జీవో నె.136 జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం (Telangana Government). గతంలో జారీ చేసిన జీవో నెం.55ను సవరించింది. వివిధ విభాగాల్లోని పలు పోస్టులను గ్రూప్ 2, 3, 4 (Group-2, 3,4 Jobs) సర్వీసుల పరిధిలోకి తీసుకువస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ఆయా సర్వీసుల్లో ఉన్న అర్హతలు ఒకేలా ఉండటంతో ఈ మార్పులు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఖాళీల సంఖ్య మరికొంత పెరగనుంది.

  గ్రూప్-2లో చేర్చిన కొత్త పోస్టులు..

  1. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్,

  2. డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్,

  3. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్,

  4. అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్,

  5. అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్.

  TS SI, Constable Jobs: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. ఈవెంట్స్, తుది పరీక్ష తేదీలివే.. ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడంటే?

  గ్రూప్-3లో చేర్చిన పోస్టులు:

  1. అకౌంటెంట్

  2. సీనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్

  గ్రూప్-4 పరిధిలో చేర్చిన పోస్టులు:

  1. జూనియర్ అసిస్టెంట్, జూనిర్ అకౌంటెంట్

  2. సూపర్వైజర్

  3. మాట్రన్ కమ్ స్టోర్ కీపర్

  4. మాట్రన్

  ఇదిలా ఉంటే.. తెలంగాణలో త్వరలోనే 2 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పదిహేను యూనివర్సిటీల బోధనా పోస్టుల భర్తీకి ప్రభుత్వం ‘ది తెలంగాణ యూనివర్సిటీస్‌ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు’ బిల్లు ను రూపొందించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ బిల్లుకు గవర్నర్‌ నుంచి ఆమోదం రావాల్సి ఉంది. అయితే.. ఈ బిల్లుపై గవర్నర్ సందేహాలను వ్యక్తం చేయడంతో.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , అధికారులు గవర్నర్ ను కలిసి సందేహాలను నివృత్తి చేశారు. గవర్నర్ నుంచి ఆమోదం వచ్చిన నెల రోజుల్లోనే 2020 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని అధికారులు యోచిస్తున్నారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Group 2, Group 3, Group 4, JOBS, Telangana government jobs, TSPSC

  ఉత్తమ కథలు