Home /News /jobs /

TELANGANA GOVERNMENT PLANS TO RELEASE TO NOTIFICATION FOR 15000 TEACHER JOBS VACANCIES NS

Telangana Teacher Jobs: తెలంగాణలో భారీగా టీచర్ జాబ్స్.. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో త్వరలో భారీగా టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణలో 50 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. మొత్తం ఖాళీల్లో అత్యధికంగా పోలీస్ ఉద్యోగాలే ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఉద్యోగాలకు ఈ వారంలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఉద్యోగాల తర్వాత అత్యధికంగా టీచర్ జాబ్స్ ఉన్నాయని సమాచారం. అయితే.. ఈ ఉద్యోగాల భర్తీకి సైతం త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఉద్యోగాలన్నీ ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో 2017లో 8972 టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. అప్పటి నుంచి మళ్లీ నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో ఆశావహులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. పోలీసు ఉద్యోగాల తర్వాత అత్యధికంగా అనేక మంది టీచర్ ఉద్యోగాల కోసమే ప్రిపేర్ అవుతుంటారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఈ నోటిఫికేషన్ ను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
    Navodaya Jobs: ప్రముఖ నవోదయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ జాబ్స్.. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

    అయితే.. విద్యాశాఖలో ప్రమోషన్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. బదిలీలను కూడా ఇంకా చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం నోటిఫికేషన్ పైన పడుతుందా? అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. ముందుగా నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలు పూర్తయ్యేలోగా బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. ప్రమోషన్లు, బదిలీల ద్వారా ఏర్పడే ఖాళీల భర్తీకి మరో  నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం సైతం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరి కొన్ని రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

    ఇదిలా ఉంటే.. ఉద్యోగ నియామకాల విషయంలో తమపై అనేక విమర్శలు ఉన్న నేపథ్యంలో ఆ అపవాదును తొలగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో వరుసగా ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాలని కసరత్తు చేస్తోంది. మళ్లీ ఎన్నికలు వచ్చే నాటికి రెండు దశల్లో నియామకాలు చేపట్టి భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని సర్కార్ యోచిస్తోంది. మొదటగా సీఎం గతంలో ప్రకటించినట్లు 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసి అనంతరం మరో విడత భారీగా నియామకాలు చేపట్టాలన్నది సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందుగానే కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసి ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలన్నది సర్కార్ వ్యూహంగా తెలుస్తోంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job Mela, Job notification, Telangana, Telangana government jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు