Home /News /jobs /

TELANGANA GOVERNMENT PLANS TO RELEASE JOB NOTIFICATIONS FOR 67 THOUSAND VACANCIES FROM JANUARY 1 NS

Telangana Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు అలర్ట్.. మొత్తం 67 వేల ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు ఎప్పటినుంచంటే?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

తెలంగాణలో త్వరలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అతి త్వరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో భారీగా ఉద్యోగాలను (Telangana Government Jobs) భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించిన నాటి నుంచి నిరుద్యోగులు నోటిఫికేషన్ల (Jobs Notification) కోసం ఎదురు చూస్తున్నారు. అయితే.. వివిధ కారణాలతో ఈ ఉద్యోగాల భర్తీ ఎప్పటికప్పుడూ వాయిదా పడుతూనే ఉండడం వారిలో ఆందోళన కలిగిస్తోంది. కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు పూర్తైన అనంతరం.. ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్లను(Notifications) విడుదల చేయాలని సర్కార్ (Telangana Government) భావిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే జనవరి 1 న న్యూ ఇయర్ (New Year 2022) కానుకగా భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నది సర్కార్ ఆలోచన. అయితే.. అప్పటి వరకు ఉద్యోగుల విభజన పూర్తయ్యే అవకాశం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

    దాదాపు 67 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయి నుంచి లెక్కలు సేకరించిన తర్వాత అధికారులు ఈ ఖాళీల సంఖ్యను ఫైనల్ చేశారు. ఈ వివరాలతో కూడిన నివేదికను ఆగస్టులో జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్ కు అధికారులు సమర్పించారు. అయితే.. వాటిని మరోసారి పరిశీలించే ప్రక్రియను తాజాగా అధికారులు ప్రారంభించారు. ఈ ప్రక్రియ పూర్తయితే.. వారంలోగా వివిధ శాఖల్లో ఖాళీలపై మరింతగా స్పష్టత రానుంది.
    Telangana Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

    ఇప్పటివరకు ఆర్డర్‌ టూ సర్వ్‌ కింద పనిచేస్తున్న ఉద్యోగులను కొత్త జిల్లాల ప్రకారం కేటాయించడం.. అందుకోసం వారికి ఆప్షన్లు ఇచ్చే ప్రక్రియను వచ్చే నెలలో చేపట్టేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఉద్యోగుల విభజన పూర్తైతే వెంటనే నోటిఫికేషన్ల విడుదలకు అడ్డంకులు తొలిగిపోనున్నాయి. ఉద్యోగుల విభజనను డిసెంబర్ 20 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ డిసెంబర్ 20 నాటికి పూర్తి అయితే.. జనవరి 1 నుంచి నిరుద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్ గా వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేసే అవకాశం ఉంది.
    IT Jobs: ఐటీ రంగంలో కొలువుల జాతర.. వచ్చే ఏడాది భారత్‌లో 4.5 లక్షల ఉద్యోగాలు.. వివరాలివే

    ఇదిలా ఉంటే.. ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై నిరుద్యోగ వర్గాల్లో అసంతృప్తి ఉంది. ఇది గమనించిన సర్కార్ భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసి ఆయా వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒకే సారి 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే సీఎం దగ్గర నుంచి ఈ ప్రకటన వచ్చి దాదాపు ఏడాది కావొస్తున్నా.. ఇంత వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాకపోవడంపై నిరుద్యోగుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్లను విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: CM KCR, Job notification, JOBS, State Government Jobs, Telangana, Telangana government jobs

    తదుపరి వార్తలు