తెలంగాణ(Telangana) లో ఉద్యోగాల (Jobs) భర్తీ కోసం నిరుద్యోగులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే 50 వేలకు పైగా ఖాళీలను ఒకేసారి భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ దాదాపుగా ఏడాది క్రితం ప్రకటించారు. అప్పటి నుంచి నిరుద్యోగులంతా మళ్లీ ప్రిపరేషన్ లో మునిగిపోయారు. అయితే ఖాళీల విషయంలో పూర్తి స్థాయిలో లెక్కలు లేకపోవడం, కొత్త జోన్ల (Telangana New Zones) చిక్కుల నేపథ్యంలో ఇన్ని రోజులుగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. అయితే జిల్లాలు, జోన్ల వారీగా ఉద్యోగుల కేటాయింపును సర్కార్ (Telangana Government) ఇటీవల చేపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వ డెడ్ లైన్ ప్రకారం ఈ నెల 31వ తేదీ కల్లా అలాట్మెంట్ ప్రకారం ఉద్యోగులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు రిపోర్ట్ చేసిన అనంతరం జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయిల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న లెక్క తేలుతుంది.
ఈ వెంటనే ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సీఎం కేసీఆర్ గతేడాది డిసెంబర్ లోనే భారీగా ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేశారు. అయితే.. వివిధ కారణాలతో ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. అయితే.. ఖాళీల లెక్కలన్నీ పక్కాగా తేల్చి ఈ జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా కనీసం రెండు, మూడు నోటిఫికేషన్లను విడుదల చేయాలని కేసీఆర్ సర్కార్ భావించింది.
అయితే.. పలు కారణాలతో అది సాధ్యపడలేదు. అయితే జనవరి మొదటి వారంలోగా ఖాళీల లెక్కలపై సంపూర్ణంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అనంతరం ప్రత్యేకంగా ఉద్యోగాల భర్తీపై మంత్రి వర్గ సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమావేశంలో ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆ వెంటనే వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Transfer Guidelines: ఉద్యోగులకు అలర్ట్... బదిలీలు, పోస్టింగ్‌ల మార్గదర్శకాలు విడుదల
గతంలో నోటిఫికేషన్లు విడుదలైన సమయంలో అనేక న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో నెలలు, సంవత్సరాల పాటు భర్తీ ప్రక్రియ సాగింది. అయితే.. ఈ సారి అలాంటి సమస్యలు ఉండకుండా పక్కాగా నోటిఫికేషన్లు ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. నోటిఫికేషన్ విడుదలైన అనంతరం నిర్ణీత గడువులోగా భర్తీ ప్రక్రియ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.
Railway Jobs: నిరుద్యోగులకు అలర్ట్... ఈ రైల్వే ఉద్యోగాల దరఖాస్తుకు 3 రోజులే గడువు
ఇదిలా ఉంటే.. ఖాళీల్లో ఎక్కువ సంఖ్యలో పోలీసు ఉద్యోగాలే ఉండే అవకాశం ఉంది. మొత్తం 20 వేల నుంచి 25 వేల వరకు ఈ ఖాళీలు తేలవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి తర్వాత టీచర్ ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు పోటీ కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి శిక్షణ ఇంచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.