• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • TELANGANA GOVERNMENT PLANS TO ALLOCATE FUNDS TO UNEMPLOYMENT ALLOWANCE IN COMING BUDGET NS

Telangana Unemployment Allowance: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ బడ్జెట్ లోనే నిరుద్యోగ భృతికి భారీగా నిధులు.. వివరాలివే..

Telangana Unemployment Allowance: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ బడ్జెట్ లోనే నిరుద్యోగ భృతికి భారీగా నిధులు.. వివరాలివే..

సీఎం కేసీఆర్

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా ముందుకు సాగుతోంది. ఈ బడ్జెట్ లోనే ఈ పథకం అమలుకు భారీగా నిధులు కేటాయించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    నిరుద్యోగుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని భావిస్తున్న ప్రభుత్వం ఇటీవల భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిరుద్యోగులకు ప్రతీ నెల రూ. 3,016 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు ముగిసి రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ పథకం అమలుకు చొరవ చూపక పోవడంతో ప్రతిపక్షాలు, నిరుద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల మంత్రి కేటీఆర్ అతి త్వరలో సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతిపై ప్రకటన చేస్తారని ప్రకటించడంతో నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.

    అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారాన్ని పరిశీలిస్తే నిరుద్యోగ భృతిపై సర్కార్ సీరియస్ గా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్లోనే ఇందుకు భారీగా నిధులను కేటాయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం రూ. 5 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్లను కేటాయించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికకు ఎలాంటి మార్గదర్శకాలను రూపొందిస్తుందన్న అంశంపై నిరుద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏ విద్యార్హతను ప్రామాణికంగా తీసుకుంటారన్న అంశంపై దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    కేవలం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ లోనే దాదాపు 25 లక్షల మంది నిరుద్యోగులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రభుత్వం మొదటి విడుతగా దాదాపు 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇచ్చే యోచనలో ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే ఒక్కొక్కరికి నెలకు రూ. 3,016 చొప్పున మొత్తం ఏడాదికి రూ. 7,238 కోట్లను ప్రభుత్వం కేటాయించాల్సి వస్తుంది. మరో రెండు మూడు రోజుల్లోనే ఈ అంశంపై క్లారిటీ రానుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు