హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

Telangana Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలు ఖాళీల(Jobs) భర్తీకి అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో అప్లై (Job Application) చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఇటీవల పల్లె దావాఖానాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పల్లెదావాఖానాల్లో ఖాళీలను (Jobs) ఆయా జిల్లాల డీఎంహెచ్ఓల ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద పల్లె దవాఖానాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. మొత్తం 26 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో (Notification) పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై (Job Application) చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. దరఖాస్తుల ప్రక్రియ ను ఈ నెల 20న ప్రారంభించగా.. దరఖాస్తుకు నవంబర్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీ సాయంత్రం 5 గంటలలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.

  ఖాళీలు, విద్యార్హతల వివరాలు..

  మొత్తం 26 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంబీబీఎస్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

  DRDO Recruitment 2021: డీఆర్డీఓలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. కేవలం మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక.. వివరాలివే

  ఎలా అప్లై చేసుకోవాలంటే..

  Step 1: అభ్యర్థులు మొదటగా https://bhoopalapally.telangana.gov.in/notice_category/recruitment/ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

  Step 2: అనంతరం ఫామ్ లో పేరు, తల్లిదండ్రుల పేరు, విద్యార్హతల వివరాలతో పాటు సూచించిన వివరాలను నమోదు చేయాలి.

  AP Job Mela: ఏపీలో భారీ జాబ్ మేళా.. 15 కంపెనీల్లో 1500 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

  Step 3: అప్లికేషన్ ఫామ్ కు టెన్త్, ఇంటర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్, మార్క్స్ మెమోలు, టీఎస్ మెడికల్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, కుల ధ్రువీకరణ పత్రంతో పాటు తదితర సర్టిఫికేట్లను జత చేయాలి.

  Step 4: అప్లికేషన్ ఫామ్ కు DM&HO, జయశంకర్ భూపాలపల్లి పేరిట తీసిన రూ. 500 డీడీని జత చేయాలి.

  Step 5: ఈ దరఖాస్తు ఫారాన్ని ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు DM&HO జయశంకర్ భూపాలపల్లి కార్యాలయంలో సర్పించాలి.

  Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 2,213 ఉద్యోగాలు... రూ.53,500 వరకు వేతనం.. పూర్తి వివరాలివే..

  అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


  అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


  అప్లికేషన్ ఫామ్ డౌన్ లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  అభ్యర్థులు ఇతర పూర్తి సమాచారం, అప్ డేట్ కోసం అధికారిక వెబ్ సైట్ https://bhoopalapally.telangana.gov.in/ ను సందర్శించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Bhupalapally, Government jobs, Job notification, JOBS, State Government Jobs, Telangana, Telangana government jobs

  ఉత్తమ కథలు