Home /News /jobs /

TELANGANA GOVERNMENT MAY RELEASE JOB NOTIFICATIONS FOR 50 THOUSAND JOB VACANCIES IN THIS NEW YEAR 2022 NS

Telangana Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు ఈ ఏడాది చాలా ముఖ్యం.. మిస్ అయితే చాలా కష్టం.. ఎందుకంటే?

తెలంగాణలోని నిరుద్యోగులకు ఈ ఏడాది చాలా ముఖ్యం.. మిస్ అయితే చాలా కష్టం.. ఎందుకంటే?

తెలంగాణలోని నిరుద్యోగులకు ఈ ఏడాది చాలా ముఖ్యం.. మిస్ అయితే చాలా కష్టం.. ఎందుకంటే?

తెలంగాణలో ఉద్యోగాల (Jobs) కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ ఏడాది ప్రభుత్వం వరుసగా శుభవార్తలు చెప్పనుంది. అయితే, అభ్యర్థులు (Unemployed) ఏ మాత్రం అలసత్వం వహించినా.. చాలా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

    తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం (CM KCR Government) రెండో సారి అధికారంలోకి వచ్చిన అనంతరం పెద్దగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల కాలేదు. దీంతో నిరుద్యోగుల్లో (Unemployed) తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలే (Government Jobs) లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అనేక మంది నుంచి ప్రభుత్వంపై అనేక విధాలుగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు సైతం ఈ అంశాన్ని అస్త్రంగా మార్చుకుని ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నాయి. ఈ ప్రభావం వివిధ ఎన్నికల ఫలితాల్లో కూడా స్పష్టంగా కనిపించింది. దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఫలితాలు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు ప్రతికూల ఫలితాలు రావడానికి ఈ అంశం కూడా ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఈ విషయాన్ని గమనించిన సీఎం కేసీఆర్ సర్కార్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. దుబ్బాక ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటిచారు. 2019 డిసెంబర్ లో ఆయన ఈ ప్రకటన చేశారు. 2020లో సీఎం ప్రకటన మేరకు నోటిఫికేషన్లు విడుదలవుతాయని అంతా భావించారు.

    అయితే, కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ప్రభుత్వానికి సవాల్ గా మారింది. ఉద్యోగుల కేటాయింపు పూర్తయితేనే ఖాళీల సంఖ్య పూర్తి స్థాయిలో తేలుతుందని భావించిన సర్కార్ ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. అయితే, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలు, అనంతరం హుజూరాబాద్ ఉపఎన్నిక, మధ్యలో కరోనా సెకండ్ వేవ్ తదితర కారణాలతో ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. అయితే కొన్ని రోజులుగా నూతన జోనల్ విధానం, కొత్త జిల్లాల ఆధారంగా ఉద్యోగాల కేటాయింపుపై సీరియస్ గా దృష్టి సారించిన సర్కార్ సాధ్యమైనంత త్వరగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
    Singareni Jobs 2022: న్యూ ఇయర్ లో సింగరేణిలో కొలువుల జాతర.. విభాగాల వారీగా ఖాళీల వివరాలివే..

    ఆ ప్రక్రియ జనవరి 20వ తేదీ లోగా పూర్తి చేయాలని భావిస్తోంది. అయితే ఆ ప్రక్రియ పూర్తి కాగానే.. ఉద్యోగ ఖాళీలపై పూర్తి స్థాయిలో లెక్కలు తేలే అవకాశం ఉంటుంది. ఆ వెనువెంటనే వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి తొలి వారంలో నోటిఫికేషన్లు విడుదల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ నాటికి సాధ్యమైనంత వరకు ఆయా ఖాళీలకు సంబంధించి అన్ని నోటిఫికేషన్లు విడుదలవుతాయని అధికారులు చెబుతున్నారు. గతంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ కారణాలతో ఏళ్ల పాటు సాగేది. అయితే ఈ సారి అలా జరగకూడదని సర్కార్ భావిస్తోంది. నిర్ణీత గుడువులోగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తోంది.
    Telangana Teacher Jobs: తెలంగాణలో భారీగా తేలిన ఉపాధ్యాయ ఖాళీలు.. మొత్తం ఎన్ని?, నోటిఫికేషన్ ఎప్పుడంటే?

    ఈ నేపథ్యంలో 2022 చివరి నాటికి 50 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే.. ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు ఈ ఏడాది చాలా ముఖ్యమని చెప్పొచ్చు. ప్రభుత్వం వయో పరిమితిలో సడలింపు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఉద్యోగాలకు పోటీ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ 50 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి అయితే మళ్లీ ఈ స్థాయిలో నోటిఫికేషన్లు విడుదలవడం చాలా కష్టమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మళ్లీ చాలా ఏళ్ల పాటు నోటిఫికేషన్ల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది.

    ఈ నేపథ్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యే వరకు వేచి చూడకుండా ఇప్పటి నుంచే సీరియస్ గా ప్రిపరేషన్ సాగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. చాలా ఉద్యోగాలకు సిలబస్, విద్యార్హతలు దాదాపుగా సేమ్ గా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒకే ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకోకుండా రెండు మూడు ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అయితే ఒకటి మిస్ అయినా.. మరొక ఉద్యోగమైనా సాధించే అవకాశం ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job notification, JOBS, State Government Jobs, Telangana government jobs

    తదుపరి వార్తలు