Home /News /jobs /

TELANGANA GOVERNMENT MAY CONDUCT ONLINE CLASSES FOR INTERMEDIATE STUDENTS GIVES ONLINE TRAINING FOR JUNIOR LECTURERS SS

ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు... లెక్చరర్లకు ట్రైనింగ్

ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు... లెక్చరర్లకు ట్రైనింగ్
(ప్రతీకాత్మక చిత్రం)

ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు... లెక్చరర్లకు ట్రైనింగ్ (ప్రతీకాత్మక చిత్రం)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ లెక్చరర్లకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతుల్ని నిర్వహించేందుకు కసరత్తు చేస్తోందా? ప్రస్తుత పరిణామాలు చూస్తే ఇదే నిజం కావచ్చనిపిస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతుండటంతో కళాశాలలు తెరుచుకునే పరిస్థితి లేదు. ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు సంబంధించిన ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. కానీ ప్రభుత్వం మాత్రం ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌పై దృష్టి పెడుతోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ల నైపుణ్యం, నాణ్యత పెంచేందుకు విద్యా శాఖ శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టింది. నిర్మాణ్ ఎన్‌జీఓ, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ లిమిటెడ్, అడోబ్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ సహకారంతో తెలంగాణ ఇంటర్మీడియట్ కమిషనరేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 'డిజిటల్ దిశ' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

    Railway Course: రైల్వే ఉద్యోగం మీ కలా? ఈ కోర్సులు చేయండి

    Scholarship: అమ్మాయిలకు డీఆర్‌డీఓ నుంచి రూ.1,86,000 స్కాలర్‌షిప్... అర్హతలు ఇవే

    జూలై 14 నంచి 15 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ట్రైనింగ్ ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల రెగ్యులర్, కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ స్కిల్స్ మెరుగుపర్చుకోవడంతో పాటు వేర్వేరు డిజిటల్ టూల్స్, సాఫ్ట్‌వేర్స్, గ్రాఫిక్స్, యానిమేషన్స్ లాంటివి ఉపయోగించుకొని ఆన్‌లైన్‌లో కోర్స్ మెటీరియల్ అందించడం, క్లాసులు తీసుకోవడం లాంటి అంశాల్లో శిక్షణ పొందొచ్చు. ఈ ట్రైనింగ్ పూర్తిగా ఉచితం. రెండు రోజుల పాటు 6 గంటల ట్రైనింగ్ ఉంటుంది. 5300 మంది లెక్చరర్లకు 12 బ్యాచ్‌లలో ట్రైనింగ్ పూర్తి చేస్తారు. డిజిటల్ టీచింగ్ మెథడ్స్, డిజిటల్ కంటెంట్ డెవలప్‌మెంట్ లాంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనే లెక్చరర్లు ప్రాజెక్ట్స్ రూపొందించాల్సి ఉంటుంది. వాటిని 12వ రోజు సబ్మిట్ చేయాలి. 15వ రోజు గ్రాడ్యుయేషన్ డే ఉంటుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, Intermediate exams, Telangana, Telangana inter board, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

    తదుపరి వార్తలు