TELANGANA GOVERNMENT MAY ANNOUNCE MINIMUM PASS MARKS TO STUDENTS WHO ARE FAILED IN RECENT RESULTS NS
TS Inter Results: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. అందరినీ పాస్ చేసే యోచనలో కేసీఆర్ సర్కార్?
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. అందరినీ పాస్ చేసే యోచనలో కేసీఆర్ సర్కార్?
ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో (TS Inter Results) కేవలం 49 శాతం మాత్రమే ఉత్తీర్ణత శాతం నమోదైన విషయం తెలిసిందే. ప్రభుత్వం, ఇంటర్ బోర్డ్ (Telangana Inter Board) తీరే ఇందుకు కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫెయిలయిన విద్యార్థుల విషయంలో తెలంగాణ సర్కార్ (Telangana Government) త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల (TS Inter First Year Results) తరువాత విద్యార్ధుల (Students) నుంచి వ్యక్తమవుతున్న ఆందోళన మరియు విద్యార్ది సంఘాల బంద్ పిలుపుల నేపథ్యంలో తెలంగాణ సర్కారు (Telangana Government) సమస్యను చక్కదిద్దడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.. ప్రభుత్వం విడుదల చేసిన ఫలితల పై ఇటు విద్యార్ధులతో పాటు అటు విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఇదే అంశాన్ని హైలెట్ చేస్తుండడంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోన్నట్ల ప్రభుత్వ వర్గాల సమాచారం. గతంలో ఇంటర్ ఫలితాలు విడుదలైనప్పుడు ఎటువంటి రచ్చ జరిగిదో ఇప్పుడు అదే స్థాయిలో జరగకుండా సమస్యకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పరీక్ష రాసిన విద్యార్థులందరినీ పాస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల తెలంగాణ ఇంటర్మిడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో దాదాపు 51 శాతం మంది విద్యార్ధులు ఫెయిల్ అయ్యారు దీంతో ప్రభుత్వ తీరుపై విద్యార్ధి సంఘాలు, విధ్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఫెయిల్ అయిన విద్యార్ధులందరికి కనీసం 30 శాతం మార్కుల వేసి పాస్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోన్నట్లు సమాచారం. మొన్న విడుదల చేసిన ఫలితాల్లో ఇంటర్ జనరల్ విభాగంలో మొత్తం 4,09,991 మంది పరీక్షలకు హాజరవ్వగా కేవలం 1,99,756 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఒకేషనల్ విభాగంలో 49, 331 మంది పరీక్షకు హాజరవ్వగా కేవలం 24,226 మంది మాత్రమే పాస్ అయ్యారు. Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఫెయిల్ అయినవారికి పరీక్షలు ఎప్పుడంటే?
జనరల్ లో 49 శాతం, ఒకేషనల్ లో కూడా 49 శాతం మాత్రమే పాస్ అయ్యారు. జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 4,59,242 మంది పరీక్షకు హాజరవ్వగా 2,24,012 మంది మాత్రమే పాస్ అయ్యారు. మొత్తం పాసైన వారి శాతం 49 శాతం మాత్రమే నమోదైంది. అయితే.. గతంలో టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్ధులు కూడా ఫెయిల్ అవ్వడంతో ప్రభుత్వ తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఫునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. TS Inter Results 2021: ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ మెమోస్ వచ్చేశాయి... డౌన్లోడ్ లింక్ ఇదే
గత ఏడాది లాక్డౌన్, ఆన్లైన్ క్లాసులు సరిగ్గా జరగని కారణంగా భోదన సిలబస్లో విద్యా శాఖ కూడా మార్పులు చేసింది. అయినప్పటికీ విద్యార్థులు 51 శాతం ఫెయిల్ అవడంతో కనీస మార్కులు 35 శాతం వేసి ఫెయిలైన విద్యార్థులను పాస్ చేసే ఆంశాన్ని విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో మెజారిటీ విద్యార్థులు ఫెయిల్ అయినందుకు నిరసనగా, విద్యార్థి సంఘాలు డిసెంబర్ 20, 2021 నుండి 2 రోజుల పాటు తెలంగాణ ఇంటర్ కాలేజీ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్ర ఆసక్తి నెలకుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.