ఏఈవోల నియామకంపై తెలంగాణ సర్కారు కీలక ప్రకటన..

వ్యవసాయ విస్తరణాధికారులు గ్రేడ్‌-2 (ఏఈవో) పోస్టుల నియామక ప్రక్రియకు అనుమతి ఇచ్చింది.

news18-telugu
Updated: May 22, 2020, 10:23 AM IST
ఏఈవోల నియామకంపై తెలంగాణ సర్కారు కీలక ప్రకటన..
తెలంగాణ ప్రభుత్వం Photo : Twitter
  • Share this:
సమగ్ర వ్యవసాయ విధానం అమలుకోసం ఏఈఓ క్లస్టర్లలో క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత ఉండొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగుల నియామకానికి ఆదేశాలిచ్చారు. వ్యవసాయ విస్తరణాధికారులు గ్రేడ్‌-2 (ఏఈవో) పోస్టుల నియామక ప్రక్రియకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 194 ఏఈవో గ్రేడ్‌-2 పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. అయితే.. ఈ నియామకంపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా కలెక్టర్లకు అప్పగించామని అభ్యర్థుల ఎంపికలో మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషనే ప్రాతిపదిక అని తెలిపారు.

నిరుద్యోగ అభ్యర్థులు ఈ విషయంలో ఎలాంటి ఆపోహాలు పెట్టుకోవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. పోస్టుల నియామకాలలో ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేదని తేల్చి చెప్పారు.
First published: May 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading