హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Students: ఆ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ దీపావళి కానుక.. మూడు రెట్లకు పైగా స్టైఫండ్ పెంపు.. వివరాలివే

Telangana Students: ఆ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ దీపావళి కానుక.. మూడు రెట్లకు పైగా స్టైఫండ్ పెంపు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) నర్సింగ్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. స్కాలర్ షిప్(Scholarship) ను భారీగా పెంచనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.

  తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నర్సింగ్ చదువుతున్న, చదవబోతున్న విద్యార్థులకు(Students) దీపావళి(Diwali 2021) పర్వదినం సందర్భంగా శుభవార్త చెప్పింది. భారీగా ఉపకారవేతనం(Scholarship) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో స్కాలర్ షిప్ మూడు రెట్లు పెరగనుంది. ఇప్పటి వరకు బీఎస్సీ నర్సింగ్(B.Sc Nursing) మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి రూ. 1500 స్కాలర్ షిప్ ఉండగా ఆ మొత్తాన్ని రూ. 5 వేలకు పెంచారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు స్కాలర్ షిప్ రూ. 1,700 ఉండగా ఆ మొత్తాన్ని రూ. 6 వేలకు పెంచింది సర్కార్. థర్డ్ ఇయర్ విద్యార్థులకు ఇప్పటి వరకు స్కాలర్ షిప్ రూ.1,900 ఉండగా ఆ మొత్తాన్ని రూ. 7 వేలకు పెంచింది ప్రభుత్వం.

  నాలుగో సంవత్సరం విద్యార్థులకు ఇప్పటి వరకు రూ. 2,200 స్కాలర్ షిప్ ఉండగా.. ఆ మొత్తాన్ని రూ. 8 వేలకు పెంచింది కేసీఆర్ సర్కార్. ఎంఎస్సీ నర్సింగ్‌ విద్యార్థులకు సైతం స్టైపెండ్‌ విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టిందని వైద్య విద్యా డైరెక్టర్ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి తెలిపారు. ఎంఎస్సీ నర్సింగ్‌ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు నెలకు రూ.9 వేలు, సెకండియర్ విద్యార్థులకు ఏడాదికి రూ.10 వేల స్టైఫండ్ అందించనున్నారు.

  MBBS Alternatives: నీట్‌‌లో మంచి స్కోర్ రాలేదా? MBBSను మించిన మంచి కెరీర్‌ ఆప్షన్స్ ఇవే

  నర్సింగ్ విద్యార్థులకు ఉపకారవేతనాన్ని పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ ఈ ఏడాది జూలై నెలలో ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నర్సింగ్ కాలేజీ ప్రారంభోత్సవానికి వెళ్లిన సమయంలో సీఎం కేసీఆర్ ను కలిసిన నర్సింగ్ విద్యార్థులు తమకు స్టైఫండ్ తక్కువగా వస్తుందని దృష్టికి తీసుకెళ్లారు. స్టైఫండ్ పెంచాలని కోరారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన సీఎం స్టైఫండ్ పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా విద్యార్థుల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది.

  NHAI Recruitment 2021: ఇంజినీరింగ్ చేసిన వారికి శుభవార్త.. NHAIలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

  ఇదిలా ఉంటే.. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల(Telangana Government Jobs) భర్తీపై మళ్లీ కదలిక మొదలైంది. రాష్ట్రంలో మొత్తం ఖాళీల సంఖ్యపై(Jobs Vacancies in Telangana) క్లారిటీ వచ్చింది. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అందిన సమాచారంతో ఆర్థిక శాఖ ఖాళీల సంఖ్యను ఫైనల్ చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను మినహాయించగా మొత్తం పోస్టుల(Jobs) సంఖ్య 49 వేలు ఉన్నట్లు ఆర్థిక శాఖ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ వివరాలతో రూపొందించిన ఫైల్ ను మంత్రివర్గ(Telangana Cabinet) ఆమోదం కోసం పంపించినట్లు తెలుస్తోంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: CM KCR, Diwali 2021, Scholarship, Telangana, Telangana Government

  ఉత్తమ కథలు