హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Notification: నిరుద్యోగులకు శుభవార్త.. టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్.. వివరాలివే

TSPSC Notification: నిరుద్యోగులకు శుభవార్త.. టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ (FOREST COLLEGE AND RESEARCH INSTITUTE MULUGU) లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 27 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల అంటే సెప్టెంబర్ 6న ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 29ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

  ఖాళీల వివరాలు:


  పోస్ట్ కోడ్ నంబర్పోస్టు పేరుఖాళీలు
  1 ప్రొఫెసర్02
  2అసోసియేట్ ప్రొఫెసర్04
  3అసిస్టెంట్ ప్రొఫెసర్21
  మొత్తం:27


  విద్యార్హతల వివరాలు:

  సంబంధిత విభాగంలో ఎంఎస్సీ మరియు పీహెచ్డీ (Ph.D) చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.57,700 నుంచి రూ.1,44,200 వరకు వేతనం ఉంటుంది. విద్యార్హతలు, వేతనాలకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. దరఖాస్తుదారుల వయస్సు 21 నుంచి 61 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

  అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

  ఇదిలా ఉంటే.. గ్రూప్ 4 ఉద్యోగాలను గుర్తిస్తూ ఇంతవరకు ఆర్థిక శాఖ జీఓ విడుదల చేయకపోవడంతో గ్రూప్ 4 కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గ్రూప్ 4 ఉద్యోగాలను క్రోడీకరించి.. రోస్టర్ నిబంధనల పరిశీలనతోనే నోటిఫికేషన్ కు ఆలస్యం అవుతోందని తెలుస్తోంది.

  TSLPRB Constable Hall Ticket Download: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్ డౌన్ లోడ్ కు మరో 5 రోజులే ఛాన్స్.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

  కొత్త జిల్లాల వారీగా ఖాళీలను గుర్తించి.. కొత్త రోస్టర్ విధానంలో పోస్టులను క్రోడీకరించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు. ఆర్థిక శాఖ నుంచి ఈ గ్రూప్ 4 ఉద్యోగాలకు వచ్చేనెలలోగా అనుమతి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నోటిఫికేషన్ జారీ మాత్రం మునుగోడు ఎన్నికల తర్వాత అంటే.. నవంబర్, డిసెంబర్ నెలలో రానున్నట్లు సమచాచారం.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: JOBS, State Government Jobs, Telangana government jobs, TSPSC

  ఉత్తమ కథలు