Home /News /jobs /

TELANGANA GOVERNMENT JOBS TSPSC RELEASED NOTIFICATION FOR DIVISIONAL ACCOUNTS OFFICER JOB VACANCIES NS

Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TSPSC నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం (image: TSPSC)

ప్రతీకాత్మక చిత్రం (image: TSPSC)

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణలో 80 వేలకు పైగా ఉద్యోగాలను (Telangana Government Jobs) భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ (CM KCR) అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం ప్రకటన మేరకు వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల చేస్తున్నారు అధికారులు. తాజాగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 53 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. డివిజ‌న‌ల్ అకౌంట్స్ ఆఫీస‌ర్స్(వ‌ర్క్స్‌) గ్రేడ్-2 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 17న ప్రారంభం కానుంది. దరఖాస్తులకు సెప్టెంబర్ 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.

    విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ విద్యార్హత పొందిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 18-44 ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ వర్గాలకు చెందిన అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో రూ. 200 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజుగా మరో రూ.120 చెల్లించాల్సి ఉంటుంది.
    TS SI Jobs Prelims Alert: తెలంగాణ ఎస్ఐ అభ్యర్థులకు అలర్ట్.. మరికొన్ని గంటలే ఆ ఛాన్స్.. తప్పక తెలుసుకోండి


    ఇదిలా ఉంటే.. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రభుత్వ ఉద్యోగార్థులకు కీలక సమాచారం వెల్లడించింది. టీఎస్‌పీఎస్సీ (TSPSC) ఇటీవల అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. 113 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది . అయితే.. నిజానికి ఈ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.



    అయితే తాజాగా దరఖాస్తుల స్వీకరణను వాయిదా (Postpone)వేస్తున్నట్లు ప్రకటించింది టీఎస్‌పీఎస్సీ. వెబ్‌సైట్‌లో నెలకొన్ని సాంకేతిక సమస్యల కారణంగానే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు టీఎస్‌పీఎస్సీ అధికారులు. టెక్నికల్‌ ప్రాబ్లమ్‌తో అప్లికేషన్స్‌ తీసుకోవడం లేదని గుర్తించిన అధికారులు గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. దరఖాస్తులు ఎప్పటి నుంచి తీసుకుంటామన్న దానిపై అధికారులు తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: JOBS, State Government Jobs, Telangana government jobs, TSPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు