తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న గ్రూప్-4 నోటిఫికేషన్ ను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. మొత్తం 9168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెబ్సైట్ లో విడుదల చేసిన బ్రీఫ్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 23న ప్రారంభించనుంది టీఎస్పీఎస్సీ. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల అంటే జనవరి 12, 2023ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో గ్రూప్-4 రాత పరీక్ష ఉంటుందని టీఎస్ పీఎస్సీ సెక్రెటరీ అనితా రామచంద్రన్ వెల్లడించారు.
S.No | డిపార్ట్మెంట్ | ఖాళీలు |
1. | అగ్రికల్చర్ అండ్ కో-ఆపరేషన్ డిపార్ట్మెంట్ | 44 |
2. | అనిమల్ హస్పండరీ, డెయిరీ డెవలప్మెంట్&ఫిషరీస్ | 2 |
3. | బీసీ వెల్ఫేర్ | 307 |
4. | కర్జూమర్ ఎఫైర్స్ ఫుడ్ & సివిల్ సప్లై డిపార్ట్మెంట్ | 72 |
5. | ఎనర్జీ డిపార్ట్మెంట్ | 2 |
6. | ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ | 23 |
7. | ఫైనాన్స్ | 255 |
8. | జనరల్ అడ్మినిస్ట్రేషన్ | 5 |
9. | హెల్త్, మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ | 338 |
10. | ఉన్నత విద్యాశాఖ | 742 |
11. | హోం | 133 |
12. | పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ | 7 |
13. | వ్యవసాయ శాఖ | 51 |
14. | కార్మిక, ఉపాధి కల్పన శాఖ | 128 |
15. | మైనారిటీ సంక్షేమ శాఖ | 191 |
16. | మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డవలప్మెంట్ | 2701 |
17. | పంచాయతీ రాజ్ మరియు రూరల్ డవలప్మెంట్ | 1245 |
18. | ప్లానింగ్ డిపార్ట్మెంట్ | 2 |
19. | రెవెన్యూ | 2077 |
20. | ఎస్సీ డెవలప్మెంట్ | 474 |
21. | సెకండరీ ఎడ్యుకేషన్ | 97 |
22. | ట్రాన్స్ పోర్ట్, రోడ్స్ మరియు బిల్డింగ్స్ | 20 |
23. | ట్రైబల్ వెల్ఫేర్ | 221 |
24. | స్త్రీ, శిశు, దివ్యాంగులు | 18 |
25 | యూత్, టూరిజం, కల్చర్ | 13 |
మొత్తం: | 9168 |
ఇందుకు సంబంధించి డిటైల్డ్ నోటిఫికేషన్ ఈ నెల 23న విడుదల కానుంది. నోటిఫికేషన్లో జిల్లాలు, రిజర్వేషన్ల వారీగా ఖాళీలు వివరాలు ఉంటాయి. విద్యార్హతలు సైతం వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉండనున్నాయి. ఆ వివరాలు సైతం నోటిఫికేషన్ విడుదల తర్వాతనే తెలియనుంది.
పోస్టుల వారీగా ఖాళీలు:
1. జూనియర్ అకౌంటెంట్ పోస్టులు- 429
2. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు- 6,859
3. వార్డు ఆఫీసర్ పోస్టులు- 1,862
4. జూనియర్ ఆడిటర్ పోస్టులు- 18
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, State Government Jobs, Telangana government jobs, TSPSC