హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Notification: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. టీఎస్పీఎస్సీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

TSPSC Notification: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. టీఎస్పీఎస్సీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notifcation) విడుదల చేసింది. మొత్తం 247 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 19 సబ్జెక్టులకు సంబంధించి 247 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 14న ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 4ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన డిటైల్డ్ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనుంది టీఎస్పీఎస్సీ. అభ్యర్థులు ఈ నెల 14 నుంచి టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ www.tspsc.gov.in వెబ్ సైట్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

విద్యార్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

Indian Navy SSR Recruitment 2022: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో 1400 జాబ్స్ .. రేపటి నుంచే దరఖాస్తులు.. పూర్తి వివరాలివే..

ఇదిలా ఉంటే.. తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1147 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  మెడిక‌ల్ విద్య పూరి చేసుకున్న వారికి తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైద్యారోగ్య శాఖ‌లో 1147 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువడింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 20, 2022 ఉదయం 10.30 గంటల నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

జనవరి 05, 2023 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. మొత్తం 34 విభాగాల్లో 1147 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. పూర్తి వివరాలకు https://mhsrd.telangana.gov.in వెబ్ సైట్ సందర్శించొచ్చు. మొత్తం 1147 పోస్టుల్లో అధికంగా అన‌స్థీషియాలో 155, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీలో 117, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌లో 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

First published:

Tags: Job notification, JOBS, Telangana government jobs, TSPSC

ఉత్తమ కథలు