అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన మేరకు రాష్ట్రంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ నుంచి వరుస ఉద్యోగ ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. తాజాగా గ్రూప్-3 నోటిఫికేషన్ ను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1365 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 24వ తేదీన ప్రారంభం కానుండగా.. దరఖాస్తుకు ఫిబ్రవరి 23ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. మొత్తం 107 విభాగాల్లోని ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భార్తీ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.