తెలంగాణలో ఈ నెల 16న నిర్వహించనున్నా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని TSPSC సూచించింది. రాష్ట్రంలో మొత్త0 503 గ్రూప్-1 ఖాళీల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకోసం మొత్తం 3,80,202 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను ఈ నెల 16న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు. గ్రూప్-1కు (TSPSC Group-1) సంబంధించి ఇంత పెద్ద సంఖ్యలో నియామకాలు చేపట్టడం ఉమ్మడి రాష్ట్రంలోనూ పెద్దగా జరిగిన సందర్భాలు లేవు. ఈ నియామకాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి అవకతవకలు జరగకూడదన్న ఆలోచనతో ప్రభుత్వం ఇంటర్వ్యూలను సైతం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో రాత పరీక్షలను సైతం అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని టీఎస్పీఎస్సీ (TSPSC) ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ రోజు నుంచి అందుబాటులో ఉంచింది పబ్లిక్ సర్వీస్ కమిషన్.
పరీక్ష కోసం ప్రతీ జిల్లాలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. అభ్యర్థుల సంఖ్య ఆధారంగా ప్రతీ జిల్లాలో 30 నుంచి 100 వరకు ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ లో 100 వరకు ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా సీసీ కెమెరాల నీడలో ఈ ఎగ్జామ్ ను నిర్వహించాలని టీఎస్సీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ప్రతీ 24 మంది అభ్యర్థులకు ఓ సీసీ కెమెరాను ఏర్పాటు చేయనున్నారు. అన్ని కేంద్రాల్లోని సీసీ కెమెరాలను టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయనున్నారు అధికారులు. ఇంకా హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు సైతం అనుసంధానం చేయనున్నారు.
Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. ఆ 10 వేల ఉద్యోగ నోటిఫికేషన్లకు బ్రేక్.. ఎందుకంటే?
హాల్ టికెట్ డౌన్ లోడ్ లింక్స్:
Step 1: అభ్యర్థులు మొదటగా టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ను ఓపెన్ చేయాలి.
Step 2: హోం పేజీలో హాల్ టికెట్ డౌన్ లోడ్ లింక్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ కనిపిస్తుంది.
Step 3: దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో TSPSC ID, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయాలి. తర్వాత క్యాప్చా నమోదు చేసి Download PDF ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4: దీంతో మీ హాల్ టికెట్ స్క్రీన్ పై కనిపిస్తంది. ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.
- హాల్ టికెట్ డౌన్ లోడ్ డౌరెక్ట్ లింక్ - Link
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Telangana government jobs, TSPSC