హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Notification: తెలంగాణలోని నిరుద్యోగులకు అలర్ట్.. TSPSC నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. ఈసారి ఖాళీలు ఎన్నంటే?

TSPSC Notification: తెలంగాణలోని నిరుద్యోగులకు అలర్ట్.. TSPSC నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. ఈసారి ఖాళీలు ఎన్నంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సారి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ సారి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ శాఖలోని ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 181 పోస్టులను (Telangana Government Jobs) ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబలర్ 8న ప్రారంభం కానుంది.దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 29ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 5 గంటలలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన నియామక పరీక్ష డిసెంబర్ లో ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొంది TSPSC.

  దరఖాస్తుదారులు 1 జూలై 2004కు ముందు జన్మించినవారై ఉండాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేండ్లు, ఎక్స్‌‍ సర్వీస్మెన్‌కు మూడేండ్లు, ఎన్‌సీసీ అభ్యర్థులకు మూ డేండ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి ఐదేండ్లు, దివ్యాంగులకు మరో పదేండ్ల వయోపరిమితి కల్పించినట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి వేతనం రూ.35,720 -రూ.1,04,430 మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకి మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. కాళేశ్వరం-26, బాసర- 27, రాజన్న- 29, భద్రాద్రి- 26, యాదాద్రి- 21, చార్మినార్‌- 21, జోగులాంబ- 31 పోస్టులు జోన్ల వారీగా ఖాళీగా ఉన్నాయి.

  TSPSC Group 4-Group 3: నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన వీఆర్ఓల సర్దుబాటు..! తగ్గనున్న గ్రూప్ 4, గ్రూప్ 3 పోస్టులు..?


  విద్యార్హతల వివరాలు:

  ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు హోమ్‌ సైన్స్‌/సోషల్‌ వర్క్‌/సోషియాలజీలో బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌/బోటనీ/జువాలజీ అండ్‌ కెమిస్ట్రీ/అప్లైడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్/బోటనీ/క్లినికల్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్/బయో కెమిస్ట్రీ/ఫుడ్‌ సైన్సెస్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్/జువాలజీ/బోటనీ అండ్‌ కెమిస్ట్రీ/బయోలాజికల్‌ కెమిస్ట్రీ లేదా అందుకు సమానమైన స్పెషలైజేషన్‌లో బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

  ఆన్‌లైన్‌లో రాత పరీక్ష ద్వారా ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మొత్తం రెండు పేపర్ల ద్వారా ఎంపిక ఉంటుంది. పేపర్‌-1లో 150 ప్రశ్నలు ఉంటాయి. జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌ విభాగం నుంచి ఈ ప్రశ్నలు వస్తాయి. పేపర్‌-2లో సంబంధిత డిగ్రీ సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 300 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 300 మార్కులు కేటాయిస్తారు. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Job notification, JOBS, Telangana government jobs, TSPSC

  ఉత్తమ కథలు