Home /News /jobs /

TELANGANA GOVERNMENT JOBS TSPSC PLANS TO RELEASE GROUP 4 NOTIFICATION SOON HERE FULL DETAILS NS

TSPSC Group-4 Notification: తెలంగాణ నిరుద్యోగులకు బీ రెడీ.. 9,618 పోస్టులతో గ్రూప్-4 నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

సీఎం కేసీఆర్ (పాత ఫొటో)

సీఎం కేసీఆర్ (పాత ఫొటో)

తెలంగాణలో గ్రూప్ 4 నోటిఫికేషన్ (Telangana Group 4 Notification) కు సంబంధించి అధికారుల కసరత్తు తుది దశకు చేరింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణలో భారీగా ఉద్యోగాలను (Telangana Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన కేసీఆర్ సర్కార్ ఈ మేరకు వరుసగా జాబ్ నోటిఫికేషన్లను (Job Notifications) విడుదల చేస్తోంది. ఇప్పటికే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన 17 వేలకు పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టీఎస్పీఎస్సీ (TSPSC) గ్రూప్ 1 కు సంబంధించి 503 ఖాళీల భర్తీకి సైతం నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సైతం ముగిసింది. టీచర్ ఉద్యోగాలకు సంబంధించి టెట్ నోటిఫికేషన్ (TS TET 2022) విడుదల కాగా.. పరీక్ష సైతం ముగిసింది. మరో 4 రోజుల్లో ఇందుకు సంబంధించిన ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే.. గ్రూప్-4 ఉద్యోగాలకు (TS Group 4 Jobs) సంబంధించి 9,618 ఖాళీల భర్తీకి అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ అన్ని ఖాళీలకు సంబంధించి ఒకే నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నారు అధికారులు. ఇందుకు సంబంధిచిన ప్రతిపాదనల ఫైల్ ను సీఎం కేసీఆర్ (CM KCR) వద్దకు ఇప్పటికే పంపించారు అధికారులు. గ్రూప్-4 కు సంబంధించి జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనోలు, టైపిస్టులు, అకౌంటెంట్లకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు ఉండడంతో క్షేత్ర స్థాయిలో పరిపాలనలకు ఇబ్బందులు ఏర్పాడుతున్నాయి.

    దీంతో సాధ్యమైనంత త్వరగా ఈ ఖాళీలను భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ పోస్టుల భర్తీకి అవలంభించాల్సిన విధానంపై చర్చించారు. విద్యార్హతలు, ఇతర అంశాలపై సైతం చర్చించారు. ఈ అన్ని అంశాలపై నివేదిక రూపొందించి సీఎం కేసీఆర్ ఆమోదానికి సంబంధిత ఫైల్ ను పంపించారు. సీఎం ఆమోదం లభించగానే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలోనే గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
    TS TET Final Key, Results Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఫైనల్ కీ, రిజల్ట్స్ డేట్స్ ఇవే..

    ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సెంట్రలైజ్డ్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు కానుంది. విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీని ఈ బోర్డు చేపట్టనుంది. ప్రస్తుతం యూనివర్సిటీలు వేర్వేరుగా ఖాళీలను భర్తీ చేస్తున్నాయి. వేర్వేరుగా కాకుండా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఖాళీలను (Jobs) ఒకే బోర్డు ద్వారా ఒకేసారి భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: CM KCR, JOBS, Telangana government jobs, TSPSC

    తదుపరి వార్తలు