తెలంగాణలో 80 వేల ఖాళీలను (Telangana Government Jobs) భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ (CM KCR) గత నెల 9న అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఏ విభాగంలో ఎన్ని ఖాళీలను భర్తీ చేయనున్నారనే లెక్కలను సైతం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్వయంగా చదివి వినిపించారు. ఇప్పటికే ఆర్థిక శాఖ 34 వేల ఖాళీల భర్తీకి అనుమతులు కూడా మంజూరు చేసింది. సీఎం ప్రకటనతో లక్షలాది మంది నిరుద్యోగులు మళ్లీ పుస్తకాల పుస్తకాల బాట పట్టారు. ఇప్పటికే కోచింగ్ సెంటర్లన్నీ నిరుద్యోగులతో కిటకిటలాడుతున్నాయి. సీఎం ప్రకటన చేసి నెల దాటినా ఒక్క నోటిఫికేషన్ (Telangana Job Notifications) కూడా విడుదల కాకపోవడంతో నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు కూడా ఈ అంశంపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. అయితే.. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా పకడ్భందీగా నోటిఫికేషన్లను విడుదల చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోందని.. ఈ నేపథ్యంలోనే నోటిఫికేషన్ల విడుదలకు ఆలస్యం అవుతోందని అధికర వర్గాలు చెబుతున్నాయి.
ఏ క్షణమైనా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇంకా గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి కూడా రెండు మూడు రోజుల్లోనే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 22న టీఎస్పీఎస్సీ భేటీ ఉంది. ఆ రోజే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రూప్ 1 కు సంబంధించి మొత్తం 503 ఖాళీలు ఉన్నాయి. పోలీస్ శాఖలో 18, 334 ఖాళీలు ఉన్నాయి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.