Home /News /jobs /

TELANGANA GOVERNMENT JOBS STATE GOVERNMENT PLANNING BOARD RELEASED PREPARATION BOOK FOR ASPIRANTS HERE DETAILS NS

TS Jobs Preparation Books: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగార్థులకు అలర్ట్.. రూ.100కే సర్కారు వారి ప్రిపరేషన్ బుక్.. ఎక్కడ కొనాలంటే?

పుస్తకాన్ని విడుదల చేస్తున్న బోయినపల్లి వినోద్ తదితరులు

పుస్తకాన్ని విడుదల చేస్తున్న బోయినపల్లి వినోద్ తదితరులు

Telangana Government Jobs: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగార్థుల కోసం రాష్ట్ర ప్రణాళిక శాఖ ఓ ప్రిపరేషన్ బుక్ ను ప్రచురించింది. ఈ పుస్తకాన్ని రూ.100కే అందుబాటులో ఉంచింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 తో (TSPSC Group 1) పాటు ఇతర శాఖలలో భారీగా ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నియామకాల కొరకు పెద్ద ఎత్తున ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు (TS Jobs Notifications) జారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా పోటీ పరీక్షలకు (Competitive Exams) ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తెలంగాణ సామాజిక ఆర్ధిక అంశాలపై పట్టు కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి స్టడీ మెటీరియల్ కొరకు ప్రయత్నిస్తున్న ఉద్యోగార్థులకు ఉపయోగపడేలా ఉండే విధంగా 300 పేజీలతో తెలంగాణ సామాజిక ఆర్ధిక ముఖచిత్రం -2022 పేరుతో ఒక పుస్తకాన్ని రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రచురించినట్లు ఆ శాఖ సంచాలకులు ఎస్. కె. మీరా ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రచురించిన ఈ పుస్తకాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి. వినోద్ కుమార్ తాజాగా విడుదల చేశారు. ఉద్యోగార్థుల సౌలభ్యం కొరకు ఈ పుస్తకం ముద్రణకు ప్రభుత్వం రూ.100/- లను సబ్సిడీగా ఇవ్వడం వలన ప్రస్తుతం రూ. 150/-లకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.

    సమగ్ర వివరాలతో మల్టీ కలర్ లో ఆకర్షణీయంగా ఉన్న ఈ పుస్తకం అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాలలో లభిస్తుందని తెలిపారు. అలాగే హైదరాబాద్ లోని ఖైరతాబాద్ GHMC సర్కిల్ ఆఫీసు ఎదురుగా ఉన్న ప్రణాళిక శాఖ "గణాంక భవన్ " లో కూడా ఈ పుస్తకాన్ని అందుబాటులో ఉంచారు అధికారులు. ప్రవేట్ బుక్ స్టాల్స్ లో ఈ పుస్తకాన్ని ఉంచలేదని వెల్లడించారు.
    TS TET 2022 Instructions: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షలో ఈ 10 రూల్స్.. తప్పక తెలుసుకోండి

    ఉద్యోగార్థులతో పాటు ఉద్యోగులు, విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులకు, వివిధ రంగాల్లోని నిపుణులకు ఈ పుస్తకం ఉపయోగకరంగా ఉంటుందని మీర వివరించారు. తెలంగాణ సామాజిక ఆర్ధిక ముఖచిత్రం -2022 పుస్తకానికి సంబంధించిన వివరాలకై రాష్ట్ర ప్రణాళిక విభాగం గణాంక అధికారి జగన్ (91826-07890), ఉప గణాంక అధికారి శ్రీనివాస్ (89789-00832)ను సంప్రదించాలని ఆయన సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Group 1, JOBS, Telangana government jobs, TSPSC

    తదుపరి వార్తలు